మానవ అభివృద్ధి సూచిలో కొద్దిగానే  మెరుగు పడ్డామా...

Human Development Index Released

11:40 AM ON 15th December, 2015 By Mirchi Vilas

Human Development Index Released

మానవ అభివృద్ధి సూచి లో భారత్ స్థానం 130గా వుంది. మానవ అభివృద్ధి సూచి అంటే... ‘‘ఒక దేశంలో సాధించిన మౌలికమైన మానవ అభివృద్ధి విజయాల (తలసరి ఆదాయం.. సగటు ఆయుర్దాయం.. పిల్లల సగటు విద్యాకాలం.. లైంగిక అసమానత్వ సూచి.. లాంటి పలు అంశాలు) ను’’ మానవ అభివృద్ధి సూచిగా లెక్కిస్తారు. ఇలాంటి లెక్కలు సరి చూస్తే, ప్రపంచంలోని 188 దేశాల్లో భారతదేశ ర్యాంకు 130 గా నమోదైంది. గతంతో పోలిస్తే , గడిచిన ఏడాదిలో 5 ర్యాంకులు మెరుగు పడిన పరిస్థితి వచ్చింది.

భారత్ లో మానవ అభివృద్ధి సూచీ విశ్లేషిస్తే, పుట్టుక నాటి ప్రమాణ అంచనాలతో సగటు ఆయుర్దాయం 68 సంవత్సరాలకు పెరిగింది. గత ఏడాది 67.6గా వుండేది. అదే 1980 ప్రాంతంలో అయితే 53.9 ఏళ్లుగా వుండేది.
తలసరి ఆదాయం చూస్తే, 2013లో 5,180 డాలర్లు గా వుంటే , 2014నాటికి 5,497కి హెచ్చింది. 1980 2014 మధ్య 338 శాతం పెరుగుదల సూచిస్తోంది.

పిల్లల సగటు విద్యాకాలం 2011నుంచీ 11.7 సంవత్సరాలుగానే వుంది. ఇక యువత సగటు విద్యాకాలం 2010 నుంచీ 5.4 సంవత్సరాలుగానే వుంది.

ఇక మన పొరుగు దేశాలు బంగ్లాదేశ్ 142వ స్థానంలో వుంటే, పాకిస్థాన్ 147 స్థానంలో వుంది. బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్.. రష్యా.. ఇండియా.. చైనా.. సౌతాఫ్రికాలో చూస్తే భారతదేశమే చివరి స్థానం లో వున్నట్లు అని తేలింది. మహిళల హెచ్ డి ఐ విలువ 2014లో 0.525 వుండగా , పురుషులలో 0.660గా వుంది.

ప్రపంచ శక్తిగా భారత్ మారాలన్న మాటలకు.. వాస్తవానికి మధ్య దూరం ఎంత ఉందన్న విషయం మానవ అభివృద్ధి సూచి స్పష్టం చేస్తుంది. జాబితాలో చివర్లో ఉన్న మనకు.. అగ్రస్థానంలో ఉన్న టాప్ టెన్ దేశాలు ఏమేం ఉంటాయో చూస్తే.. మన లక్ష్యం చాలా పెద్దదే మరి.

English summary

Human Development Index(HDI) for the year 2014 has been released and in that list Norway holds the first place and India is in 130 th place