భార్య ఆడుతుంటే ... భర్త కేక

Hungarian Swimmer Breaks World Record

11:49 AM ON 8th August, 2016 By Mirchi Vilas

Hungarian Swimmer Breaks World Record

అవును ఇదో అరుదైన జంట. ఈ భార్యాభర్తలలో ఒకరు కోచ్, మరొకరు క్రీడాకారిణి. ఒక పక్క భర్త పూల్ బయట నుంచి ప్రోత్సహిస్తుంటే భార్య ప్రపంచ రికార్డే సృష్టించేసింది. అంతేకాదు స్వర్ణాన్నీ ఒడిసిపట్టింది. ఆమే హంగేరి భామ కటిన్కా హొస్జు. మహిళల 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో ఆమె కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 4:26.36 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరిన హొస్జు పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రిలిమినరీలో సెకనులో పదోవంతు తేడాతో ఈ రికార్డును కోల్పోయిన హొస్జు ఫైనల్లో మాత్రం వదల్లేదు. ఈ రేసు జరుగుతున్న సమయంలో ఆమె భర్త షేన్ టుసప్ గొంతు చించుకునేలా అరుస్తూ ప్రోత్సాహించడం అందరినీ విశేషంగా ఆకర్షించింది.

కాగా రియో ఒలింపిక్స్లో మరో ప్రపంచ రికార్డు బద్దలైంది. పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లో బ్రిటీష్ స్విమ్మర్ ఆడమ్ పీటె నయా రికార్డుకు తెర తీశాడు. 21 ఏళ్ల పీటె 57.55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి తన పేరిటే ఉన్న గత రికార్డు (57.62 సెకన్లు)ను తిరగరాస్తూ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఒక బ్రిటన్ స్విమ్మర్ స్విమ్మింగ్లో స్వర్ణం గెలవడం 28 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

అలాగే స్విమ్మింగ్లో మరో రికార్డును ఆస్ట్రేలియా అమ్మాయిలు బద్దలు కొట్టారు. మహిళల 4×100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో ఎమా మెకీయన్, బ్రిట్నె, బ్రెంట్ క్యాంప్బెల్లతో కూడిన ఆస్ట్రేలియా జట్టు 3:30.65 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి 2014 కామన్వెల్త్ క్రీడల్లో తామే సృష్టించిన రికార్డు (3:30.98 ని)ను బద్దలు కొట్టారు.

ఇది కూడా చూడండి: మేకప్ లేకుండా మన హీరోయిన్స్‌ను చూడలేం !!!

ఇది కూడా చూడండి: శ్రీశైలం లో బయట పడ్డ రహస్యాలు

ఇది కూడా చూడండి: ఈ దేశాలలో మన రూపాయి విలువ చాలా ఎక్కువ

English summary

Hungarian Swimmer Breaks World Record.