పెళ్ళాంతో కాదని మరదలితో సరసం.. ఆపై.. ఏం చేసారంటే...

Husband affair with wife sister and killed wife

02:59 PM ON 26th August, 2016 By Mirchi Vilas

Husband affair with wife sister and killed wife

లోకం తీరు బహు విచిత్రం. ఇది ఒక్కోసారి బానే ఉంటుంది. ఒక్కోసారి శృతిమించి రాగాన పడుతుంది. ఇక క్రిమినల్ మైండ్ తోడైతే, చేసే పనులకు అంతూ పొంతూ ఉండదు. సరిగ్గా ఇది అలాంటిదే. పెళ్లయి సరిగ్గా రెండు నెలలు కూడా కాలేదు. ఆ మగాడి మనసు మరదలిపై మళ్లింది. ఆమెపై మోజు పెంచుకున్నాడు. తప్పని చెప్పాల్సిన మరదలు కూడా కమిట్ అయింది. ఆ తప్పు చేసింది. వీరిద్దరి వ్యవహారం ఆ నవ వధువు జీవితాన్ని సర్వ నాశనం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన దారుణ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని పాలెం ప్రాంతానికి చెందిన పూజాకు, రాహుల్ సోలంకికి నెలన్నర క్రితం వివాహమైంది. పూజా, రింకీ అక్కాచెల్లెళ్లు. పూజ కన్నుగప్పి రాహుల్, రింకీతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.

అయితే వీరిద్దరి యవ్వారం కొద్దిరోజులకు పూజకు తెలిసింది. ఇదేంటని నిలదీయడంతో కొన్నాళ్లు దూరంగా ఉన్న ట్టు నటించారు. కానీ వీరి నిశ్శబ్ధం వెనుక పక్కా వ్యూహం ఉందన్న సంగతి పూజ గ్రహించలేకపోయింది. ఎందుకంటే, సొంత అక్క కాపురంలో నిప్పులు పోసిన రింకీ అంతటితో ఆగలేదు. అక్కనే చంపడానికి బావతో కలిసి మాస్టర్ ప్లాన్ వేసింది. ఆమెను చంపేసి ఇద్దరం పెళ్లి చేసుకుందామని రాహుల్ కూడా డిసైడ్ అయ్యాడు. ఇందుకు అవసరమైన సపోర్ట్ ఇచ్చాడు. ఇంకేముంది, పూజ నిద్రిస్తున్న సమయంలో ఇద్దరూ కలిసి దుప్పటితో ఆమెకు ఊపిరాడకుండా బిగించారు. ఆమె అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందింది. రింకీ, రాహుల్ ను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణానికైనా ఒడిగడతాయని ఈ ఘటన తాజాగా నిరూపించింది.

ఇది కూడా చదవండి: ప్రయాణికులకు తెలియకుండా పైలట్స్ రహస్యంగా ఉంచే సీక్రెట్స్ ఇవే!

ఇది కూడా చదవండి: అభిమన్యుడుని చంపడానికి రచించిన పద్మవ్యూహానికి సంబంధించి పూర్తి ప్లాన్ ఇదే!

ఇది కూడా చదవండి: నీ మొఖానికి అమ్మాయి కూడా పడిందా: మంచు లక్ష్మీ

English summary

Husband affair with wife sister and killed wife.