ఈవిడ బరువు 128 కేజీలు.. కాలు జారి భర్త పై పడింది.. ఏమైందో తెలుసా?

Husband and Wife were died while getting on to the steps

03:45 PM ON 5th July, 2016 By Mirchi Vilas

Husband and Wife were died while getting on to the steps

ఈ ఫోటోలు కనిపిస్తున్న ఆమె బరువు 128 కేజీలు.. మెట్లెక్కుతూ పొరపాటుగా కాలు జారి భర్త పై పడింది.. ఆ తరువాత ఇద్దరూ మరణించారు.. ఈ వింత విషాదం రాజ్ కోట్ లో సంభవించింది. ఆ వివరాల్లోకి వెళితే... మంజుల విఠ్లానీ, ఆమె భర్త నట్వర్ లాల్ ఒక అపార్ట్మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్నారు. వారి కొడుకు, కోడలు(ఆశిష్, నిషా) ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్నారు. అశిష్ కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో నిషా మందుల కోసం తెల్లవారుజామున 4 గంటలకు క్రిందకు దిగింది. ఆమె తోడుకోడళ్ళు కూడా ఆమెను చూసి నిద్రలో నుండి మేలుకొన్నారు.

ఇంతలో మంజుల, నట్వర్ లాల్ తమ కొడుకు ఆశిష్ ను చూడాలన్న కంగారుతో పరుగుపరుగున మెట్లు ఎక్కి వెళ్ళబోయారు. అయితే మంజుల వయసు 68 ఏళ్ళు, ఆమె బరువు 128 కేజీలు. ఆమె మెట్లు ఎక్కుతూ ఉండగా పట్టుతప్పి పడిపోయారు. ఆమె వెనుకనే మెట్లు ఎక్కుతున్న నట్వర్ లాల్ పై ఆమె పడిపోవడంతో ఆయన తల పగిలింది. మంజులకు కాలు విరగింది. ఇద్దర్నీ ఆసుపత్రికి తరలించారు వారిద్దరికీ సెరిబ్రల్ హెమరేజ్ రావడంతో మరణించినట్లు వైద్యులు చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.

English summary

Husband and Wife were died while getting on to the steps