భార్యపై కత్తితో దాడి(వీడియో)

Husband attacks wife with knife

11:41 AM ON 18th July, 2016 By Mirchi Vilas

Husband attacks wife with knife

క్షణికావేశంలో ఎవరు ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. ఉన్మాదం జడలు విప్పుతోంది. ఈ క్రమంలోనే విజయవాడ నగరంలో భార్యపై ఓ ఉన్మాది హత్యాయత్నం చేశాడు. కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రి పాలయ్యారు. పెనజోన్ పేట, అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ప్రాధమిక వివరాల్లోకి వెళ్తే.. ఏడాది క్రితం వారిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆరు నెలలుగా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్తలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో భార్యపై భర్త కక్ష పెంచుకుని కొబ్బరికాయలు నరికిన కత్తితో దాడికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Husband attacks wife with knife