హైదరాబాద్ లో దారుణం: హీటర్ ఎక్కువగా వాడుతుందని భార్య బట్టలు ఊడదీసి..

Husband beats wife for using water heater

02:52 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Husband beats wife for using water heater

హైదరాబాద్ లో అత్యంత దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. బాత్ రూంలో స్నానం చేస్తున్న భార్యను బట్టలు లేకుండానే బయటకు లాక్కొచ్చి కొట్టడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనా వివరాల్లోకి వెళితే.. సూర్యాపేటకు చెందిన సుశృత(30)కి పూసలబస్తీకి చెందిన నూతలగంటి మోహన్ తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మోహన్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. అయితే, కొద్ది రోజులుగా భర్తతోపాటు అత్త మామలు సుశృతను తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆమెపై అనుమానంతో ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి తీవ్రంగా వేధిస్తున్నారు.

1/3 Pages

ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం సుశృత స్నానం చేయడానికి వేడి నీళ్లు పెట్టుకుంది. అనంతరం స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లింది. ఇంతలో వేడి నీళ్ల కోసం వాటర్ హీటర్ ను ఎక్కువసేపు ఉపయోగించిందంటూ అత్తమామలు ఆమె భర్తను ఉసిగొల్పారు. దీంతో అతడు బాత్రూంలో స్నానం చేస్తుండగానే సుశృతను కొట్టాడు. తప్పయిపోయిందని, క్షమించాలని వేడుకున్నా ఊరుకోలేదు. స్నానం చేసి బాత్రూం నుంచి బయటకు వచ్చిన తర్వాత వివస్త్రగా ఉండగానే.. మళ్లీ కొట్టాడు. ఇంట్లో అత్తమామలు, తోడి కోడలు, ఆమె పిల్లలు చూస్తుండగా ఒంటిపై దుస్తులు లేకపోయినా విచక్షణరహితంగా కొట్టాడు.

English summary

Husband beats wife for using water heater. A cruel husband beats his wife for she is using water heater more time.