కట్నం కోసం భార్య నగ్న వీడియో నెట్ లో పెడతానన్న భర్త

Husband blackmails his wife for dowry

04:05 PM ON 26th May, 2016 By Mirchi Vilas

Husband blackmails his wife for dowry

ఒక దుర్మార్గ భర్త కట్నం కోసం కట్టుకున్న భార్యకు నరకం చూపించాడు. తనకి కావాల్సినంత కట్నం తీసుకురాకపోతే ఏకాంతంలో ఉన్నప్పుడు ఆమెకు తెలియకుండా తీసిన నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో పెడతానంటూ బెధిరింపులకు దిగాడు. వివరాల్లోకి వెళితే.. తాడ్బన్, బషారత్నగర్, రంజన్ కాలనీకి చెందిన మిర్జా ఖాలీద్ అలీ బేగ్ తనయుడు, ప్రస్తుతం ఖతార్లో ఇంజినీర్గా పని చేస్తున్న మిర్జా అర్షద్ అలీ బేగ్తో పది నెలల క్రితం తనకు పెద్దల సమక్షంలో వివాహమైందని బాధితురాలు కమిషన్కు వివరించింది. భర్త అర్షద్ అలీ బేగ్ తనను ఖతార్ రావాలంటూ వీసా పంపించారని, అక్కడకు వెళ్లాక ఆయన నిజస్వరూపం బయట పడిందన్నారు.

కారు కొనుక్కోవడానికి 2 లక్షలు ఇవ్వాలంటూ వేధించాడని, అవి ఇచ్చాక మళ్లీ 3 లక్షలు అడిగాడని, ఇలా ఎప్పటికప్పుడు తన గొంతెమ్మ కోర్కెలు తీర్చుకోవడానికి తనను వేధించడం మొదలు పెట్టాడని కమిషన్ ముందు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రి పరిస్థితి బాగా లేదని, ఇంకా డబ్బు ఇవ్వలేరని చెప్పడంతో పడక గదిలో నీకు తెలియకుండా తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు నా దగ్గరున్నాయి, వాటిని సోషల్ మీడియాలో పెడతా అంటూ బెధిరిస్తున్నాడని వాపోయింది. అంతే కాకుండా భర్త కొట్టడం వల్ల తనకు గర్భస్రావం అయిందని చెప్పింది. అతని హింస భరించలేక స్వదేశానికి వచ్చానని పేర్కొంది. తనకు న్యాయం చేయాలంటూ హెచ్చార్సీని వేడుకుంది.

English summary

Husband blackmails his wife for dowry