భార్యకు సినిమా చూపించడానికి ఏకంగా థియేటర్ బుక్ చేసాడు

Husband booked an entire theater for his wife

11:35 AM ON 8th July, 2016 By Mirchi Vilas

Husband booked an entire theater for his wife

ఒక్కొక్కడు ఒక్కో రకం అన్నారు అందుకనే... ఇక భార్య పట్ల ప్రేమతో కొందరు నగలు కొంటే.. మరికొందరు చీరలు వగైరాలు కొంటారు. ఇంకొందరు ఆమెకు ఇష్టమైన పనులు చేసి మెప్పిస్తారు. ఒకప్పుడైతే తాజ్ మహల్ లాంటివి కూడా కట్టించారు. కాకపోతే, కొందరు వెరైటీ చూపిస్తారు. కానీ ఈ దర్శకుడు తన భార్యకు సినిమా చూపడానికి ఏకంగా థియేటర్ బుక్ చేసాడు. హిమాచల్ ప్రదేశ్ లోని హమిర్ పూర్ కు చెందిన శంకర్ మాత్రం భార్య గీతాంజలిపై తనకున్న ప్రేమను ఇలా చూపించాడు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘సుల్తాన్’ సినిమాను ఆమెకు చూపించి భార్య కళ్లల్లో సంతోషం చూడాలనుకున్న శంకర్ ఏకంగా సినిమా థియేటర్ నే బుక్ చేశాడు. భార్య సల్మాన్ ఫ్యాన్ అని తెలుసుకున్న శంకర్ సినిమా విడుదల ముందు రోజు గురుకుల్ మాల్ కు వెళ్లి థియేటర్ మొత్తాన్ని బుక్ చేశాడు. ‘‘సినిమా హాల్ ను బుక్ చేసిన శంకర్ కనీసం 120 మందితో వస్తాడనుకున్నాం. కానీ భార్యతో కలిసి రావడంతో ఆశ్చర్యపోయాం’’ అని మాల్ ఎండీ అమిత్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లోనే గీతాంజలిని పెళ్లి చేసుకున్న శంకర్ తన భార్య ప్రేమ కోసం థియేటర్ నే బుక్ చేసి తన ‘లవ్’ ఏపాటిదో ‘చూపించాడు’ దటీజ్ శంకర్.

ఇది కూడా చూడండి: వాట్సప్ లో ఈ ఫీచర్స్ మీకు తెలుసా

ఇది కూడా చూడండి: సన్నీలియోన్ గురించి మీకు తెలియని విషయాలు

ఇది కూడా చూడండి: ఆమె ఇంట్లో బయట పడ్డ రహస్య గది

English summary

Shankar Musafir from Hamirpur city Booked First Day First Show Salman Khan sultan Film Hall For Wife.