ప్రియురాలితో దొరికి, అడ్డంగా బుక్కయ్యాడు

Husband Caught With His Wife Along With His Girl Friend

06:14 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Husband Caught With His Wife Along With His Girl Friend

నడిరోడ్డు మీదే ఉతికి ఆరేసిన పెళ్ళాం

ఇంట్లో ఇల్లాలు - బయట ప్రియురాలితో జల్సా చేస్తున్న అతగాడు నడిరోడ్డు మీద అడ్డంగా బుక్కయ్యాడు. కారులో షికారుకెళ్తూ ఏకంగా భార్యకే దొరికిపోవడంతో రభస అయింది. పైగా ఆ కారు ఇల్లాలిది కావడంతో పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోండి. పరాయి స్త్రీతో తిరుగుతున్న భర్తను చూసి అగ్గిమీద గుగ్గిలమై పోయిన ఆ ఇల్లాలు వెనకా ముందూ చూడకుండా నడిరోడ్డు మీదే భర్తను కడిగి పారేసింది. కారుకు అడ్డంగా నిలబడి మరీ నా కారులోంచి ఆమెను దింపుతావా లేదా అంటూ కేకలు వేస్తూ తిట్ల పురాణం లక్కించుకుంది.

ఇంతకీ ఈ ఘటన జరిగింది భారత్ లో కాదు. కొలంబియాలో.... నడిరోడ్డుమీద భర్తను తిడుతూ ఆమె చేస్తున్న హడావుడికి మరికొందరు తోడయ్యారు. దీంతో ఎక్కడి ట్రాఫిక్‌ అక్కడే గప్ చిప్ అయింది. అందరూ కలిసి నినాదాలు చేస్తూ కారు తలుపులు తెరవమని ఒకటే గొడవ. ఇలా దొరికేసాం ఏమిటి అనుకుంటూ, వారికి ఏంచేయాలో పాలుపోక చివరకి పోలీసులకు ఫోన్‌ చేశారు.పోలీసులు వచ్చినా కూడా ఈ తతంగం చూసి, కాసేపు ఏమీ చేయలేకపోయారు. ఇంతలోనే ఈ ఉదంతమంతా కొందరు వీడియోలు తీసేసి, భలే చాన్సులే లక్కీ చాన్సులే అంటూ, సోషల్‌మీడియా కు అప్ లోడ్ చేసేసారు.

మొత్తానికి ఓ ఉన్నతాధికారి వచ్చి ఆ ఇల్లాలికి , ఆమెకు మద్దతిస్తూ ఆందోళన చేస్తున్న జనానికి నచ్చజెప్పి, సదరు భర్తగారిచేత కారు తలుపు తెరిపించారు. కారులో ఉన్న మహిళను సురక్షితంగా సాగనంపారు. ఆ తర్వాత భార్యాభర్తలకు సర్దిచెప్పి ట్రాఫిక్‌ని పునరుద్ధరించారు. ఇంతటితో ఆగలేదు, ఇప్పుడు ఈ భార్యభర్తల వ్యవహార వీడియో ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. ప్రియురాలితో జోరుగా తిరిగే వాళ్లకు ఇదో హెచ్చరిక.

English summary

A man caught red handedly tho his wife along with his girl friend in a public place and she beat him on road . This incident was occured in Colombia Country.