భార్యకు ఆస్తి రాసేసి.. మోసపోయిన మొగుడు

Husband cheated by wife

03:05 PM ON 14th June, 2016 By Mirchi Vilas

Husband cheated by wife

ఇదో వింత కేసు.. ఉన్నదంతా భార్య పేరున రాసేసి, మోసపోయాడు. ఇప్పుడు వాటాకోసం ఆందోళనకు దిగాడు. తన ఆస్తిలో వాటా కోసం ఓ భర్త తన భార్య ఇంటి ముందు పోరాటానికి దిగిన ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో చోటు చేసుకుంది. రమేష్ చంద్ర అనే వ్యక్తి తన ఆస్తులన్నింటినీ భార్య శైలజ పేరిట రాసేశాడు. అయితే ఆమె భర్త నమ్మకాన్ని వమ్ము చేస్తూ భర్తను అక్రమ కేసుల్లో ఇరికించిందట. ఇదే విషయాన్ని అతను స్పష్టం చేస్తూ, తనను భార్య ఇంటి నుంచి వెళ్లగొట్టిందని ఆరోపించాడు. తనకు న్యాయం కావాలంటూ రమేష్ చంద్ర భార్య ఇంటి ఎదుట ఆమరణ దీక్షకు దిగాడు.

English summary

Husband cheated by wife