ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు.. ఆ తరువాత అసలు విషయం బయట పెట్టాడు!

Husband cheats wife in Chennai

10:19 AM ON 27th May, 2016 By Mirchi Vilas

Husband cheats wife in Chennai

పెళ్ళంటే నూరేళ్ళ పంట... కానీ దానర్ధం మారిపోయింది... కాదు కాదు కొందరు మార్చేస్తున్నారు... ఇది ఓ సారి చదవండి తెలుస్తుంది... కలకాలం కలిసుంటానని మాట ఇచ్చాడు. ఇంట్లోవారిని ఒప్పించి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె తలిదండ్రులు కూడా భారీగానే కట్నకానుకలు ఇచ్చి ఆమె పెళ్లి జరిపించారు. కానీ వివాహం తర్వాత ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. అతడి నిజ స్వరూపం బహిర్గతమైంది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లా కొత్తపల్లికి చెందిన జ్యోతికి అదే జిల్లావాసి అయిన విజయానంద్ తో 2010లో పెళ్లయింది. అప్పటికి విజయానంద్ చెన్నైలో జాబ్ చేస్తున్నాడు.

అతని సోదరికి మతి స్థిమితం సరిగా లేనందున కాపురం చెన్నైలో పెట్టారు. జ్యోతి-విజయానంద్ దంపతులకు ఓ మగబిడ్డ పుట్టాడు. కొన్నాళ్లకే విజయానంద్ అసలు స్వరూపం బయటపడింది. అతని తలిదండ్రులు అదనపు కట్నం కోసం జ్యోతిని వేధించడం ప్రారంభించారు. పైగా ఆమె పై అభాండాలు వేశారు. పుట్టిన బిడ్డకు విజయానంద్ తండ్రి కాదని, తమకు విడాకులు కావాలని నోటీసులు పంపారు. దీంతో జ్యోతి కన్నీరు మున్నీరవుతోంది. ప్రస్తుతం విజయానంద్ లండన్ లో ఉంటున్నాడు. కాగా తన బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేయించడానికైనా తాను సిద్ధమేనని, తనకు న్యాయం చేయాలని జ్యోతి కోరుతోంది.

తమ కూతురిని విజయానంద్ బాగా చూసుకుంటాడని నమ్మి సుమారు 20 లక్షల వరకు కట్నం ఇచ్చి పెళ్లి చేశామని, కానీ అతడు. అతని పేరెంట్స్ ఇలా అన్యాయంగా ఆడిపోసుకుంటున్నారని జ్యోతి తల్లిదండ్రులు వాపోతున్నారు.

English summary

Husband cheats wife in Chennai