భార్య గొంతు కోసేసి, పరారయిన భర్త

Husband cuts his wife's neck and ran away

05:43 PM ON 9th June, 2016 By Mirchi Vilas

Husband cuts his wife's neck and ran away

రోజూ ఎక్కడో అక్కడ దారుణం జరుగుతూనే వుంది. తాజాగా ఓ ప్రబుద్ధుడు భార్యను హత్య చేసి పారిపోయాడు. పోలీసుల కధనం ప్రకారం.... హైదరాబాద్ వారాసిగూడకు చెందిన లక్ష్మి(25)కి గతంలో వివాహమైంది. కొద్ది కాలం సజావుగా సాగిన వారి కాపురంలో కలతలు రేగాయి. ఇద్దరి మధ్య గొడవలు జరిగి చివరకు విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆమెకు కడపకు చెందిన వెంకటేష్ తో పరిచయం ఏర్పడింది. ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. లాలాపేటలో నివాసముంటూ నఫీజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య గత కొంత కాలంగా చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి.

వెంకటేష్ ప్రతి చిన్న విషయానికీ భార్యతో గొడవపడేవాడు. మంగళవారం రాత్రి భార్యతో గొడవపడిన వెంకటేష్ బ్లేడుతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం గది తలుపులు మూసి పరారయ్యాడు. లక్ష్మి ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. అనుమానం వచ్చి చుట్టుపక్కలవారు బుధవారం గది తలుపులు తీసి చూడగా లక్ష్మి రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉంది. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమె తండ్రి భిక్షమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని వెంకటేష్ కోసం గాలిస్తున్నారు.

English summary

Husband cuts his wife's neck and ran away