భార్య కాపురానికి రాలేదని చెవి కోసేసాడు

Husband cuts wife ear for she is not coming to home

10:13 AM ON 17th March, 2016 By Mirchi Vilas

Husband cuts wife ear for she is not coming to home

భార్య అలిగి ఇంటికి రాకపోతే ఆమెని బుజ్జగించి ఇంటికి తీసుకొచ్చే భర్తలని చూశాం. కానీ ఒక ప్రభుధ్ధుడు భార్య కాపురానికి రావడం లేదని ఆమె చెవి కోసి పారిపోయాడు. చెన్నై ఆవడి సమీపంలో బంగారం పేట కరుమారియమ్మన్ కోవిల్ వీధికి చెందిన మారియప్పన్(37) గోమాంసం దుకాణం నడుపుతున్నాడు. ఇతని భార్య మాలతి(24). వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఈ దంపతుల మధ్య చిన్నపాటి గొడవ ఏర్పడడంతో అతని భార్య మాలతి కోపంతో ఆమె తల్లి అములు పనిచేసే గార్డన్‌కు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న మారియప్పన్ అర్ధరాత్రి 12 గంటలకు గార్డెన్‌కు వెళ్లాడు. మాలతిని తనతో పాటు ఇంటికి రమ్మని పిలిచాడు.

షకలక శంకర్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవన్

దానికి మాలతి అంగీకరించకపోవడంతో దంపతుల మధ్య మళ్లీ గొడవ తలెత్తింది. దీనితో ఆగ్రహించిన మారియప్పన్ మాంసం కొట్టే కత్తితో మాలతి కుడి చెవి కోసి పారిపోయాడు. ఈ దాడిలో గాయపడిన మాలతిని ఆమె బంధువులు కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు ఆవడి ట్యాంక్ ఫ్యాక్టరీ పోలీసులు పరారీలో ఉన్న మారియప్పన్‌ను అరెస్టు చేశారు. అతడిని అంబత్తూరు కోర్టులో హాజరు పరచి పుళల్ జైలుకు తరలించారు.

చెల్లెలి నగ్న వీడియో ఉందని చెప్పి అక్కను వాడుకున్నాడు

English summary

Husband cuts wife ear for she is not coming to home. This incident is held at Aavadi, Bangaram Peta, Chennai.