గడ్డపారతో 'ఆ' టెస్ట్ పెట్టిన దుర్మార్గుడు

Husband Demands for Virginity Test

11:55 AM ON 15th July, 2016 By Mirchi Vilas

Husband Demands for Virginity Test

రాను రాను రోజులు చూస్తుంటే ఇంత దారుణమా అనిపించక మానదు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో వెలుగుచూసిన దారుణం ప్రస్తావిస్తే, గుండె చెరువవుతుంది. సభ్యసమాజంలో ఇంకా ఇలాంటి దారుణాలు కొనసాగుతున్నాయా అనిపిస్తుంది. విషయం ఏమంటే, కాలిన గడ్డపలుగుతో భార్యకు శీలపరీక్ష పెట్టేందుకు భర్త పస్తం తానేష్ ప్రయత్నించాడు . చేతులు కాలకపోతే శీలపరీక్షలో నెగ్గినట్లు నిరూపణ అవుతుందని భార్యను ఒప్పించాడు. అంతేకాదు, శీల పరీక్షకు ఒప్పుకున్నట్లు భార్య చేత ప్రమాణపత్రం కూడా రాయించాడు. కాపురాన్ని నిలబెట్టుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అభాగ్యురాలు కులపెద్దల సాక్షిగా శీలపరీక్షకు సిద్ధపడింది.

అయితే ఈ విషయం ఆనోటాఈనోటా పోలీసులకు చేరడంతో చివరినిమిషంలో చిల్లకొల్లు పోలీసులు రంగప్రవేశం చేసి, అడ్డుకున్నారు . అయితే, తన పాతివ్రత్యాన్ని నిరూపించేందుకు పూర్తి అంగీకారంతోనే గడ్డపొలుగు పట్టుకుంటున్నానని ముందుగానే భార్యచేత లేఖరాయించి వేలిముద్ర వేయించుకున్న భర్త తానేష్ ను, కులపెద్దలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చూడండి : హల్ చల్ చేస్తున్న ఇలియానా బికినీ ఫోటోలు

ఇది కూడా చూడండి : రాత్రి 7 తరువాత ఈ తప్పులు చేయకూడదట

ఇది కూడా చూడండి : ఈ పిల్లాడి తిండి కోసం ఆప్పులపాలయ్యారు

English summary

Husband Demands for Virginity Test.