భార్య డాన్స్ చేసిందని.. ఆమెను భర్త ఏం చేసాడో తెలుసా?

Husband gave divorce to his wife for dancing in home

11:47 AM ON 3rd May, 2016 By Mirchi Vilas

Husband gave divorce to his wife for dancing in home

భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరగడం మామూలే.. అయితే ఎన్ని గొడవలు జరిగినా మళ్లీ కలిసుండే వారు ఇది వరకటి భార్యాభర్తలు. కానీ ఇప్పుడు భార్యభర్తలు మాత్రం చిన్న గొడవ జరిగినా దాన్ని బూతద్దంలో చూసి విడిపోవడానికే మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఇలాంటి గొడవే జరిగింది. అసలు విషయంలోకి వెళితే ఖతార్‌ కి చెందిన ఓ భర్త తన భార్య డ్యాన్స్ చేస్తుందని విడాకులు ఇచ్చేశాడు. భక్తి ఛానళ్లు తప్ప వేరే చానళ్లు ఏవీ చూడకూడదని పెళ్లి అయిన కొత్తలో ఆమె చేత ప్రమాణం చేయించుకున్నాడు సదరు భర్త. అయితే ఓ చానల్‌లో తనకిష్టమైన పాట వస్తుండడంతో తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఆమె కాలు కదిపి డాన్స్ చేసింది.

సరిగ్గా అదే సమయానికి ఆఫీసు నుంచి వచ్చిన భర్త అది చూసి తాండవం ఆడాడు. నా ఆజ్ఞను పట్టించుకోవా అంటూ ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. వెంటనే విడాకులు కూడా ఇచ్చేశాడు. పెళ్లినాటి ప్రమాణాలను మరచి, తనను మోసం చేసిన భార్యను క్షమించేదిలేదని కూడా స్పష్టం చేశాడు. అయితే ఈ విషయాన్ని వెల్లడించిన సౌదీ మీడియా ఆ భార్యభర్తల వివరాలు మాత్రం తెలియజేయడంలేదు.

English summary

Husband gave divorce to his wife for dancing in home. Kathar husband gave divorce to his wife for dancing in home.