ఆరేళ్లైనా శోభనానికి ఒప్పుకోలేదని భార్యకు అదిచ్చాడు

Husband gave divorce to his wife for rejecting first night

10:37 AM ON 16th April, 2016 By Mirchi Vilas

Husband gave divorce to his wife for rejecting first night

మానవ జీవితం అన్నాక ఎన్నో వింతలూ, విడ్డూరాలు సహజం. అన్ని చోట్లా ఒకేలా ఉండదు, మనుషులంతా ఒకేలా ఆలోచించరు. అందరూ ఒకేలా ఉంటే ఇక లోకంలో గొడవలకు ఆస్కారం ఉండదుగా.... పంతాలూ, పట్టింపులూ మనుషుల జీవితాలు దెబ్బతింటున్నాయి... పచ్చని కాపురాలు కుప్ప కూలుతున్నాయి... ఇక కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు చెందిన ఓ ప్రభుత్వాధికారికి ఆరేళ్ల క్రితం వివాహం అయింది. అయితే ఆయనకు ఇప్పటి వరకు శోభనం జరగలేదట. దీంతో సహనం కోల్పోయిన అతడు కోర్టును ఆశ్రయించాడు. తనకు ఆమె నుంచి విడాకులు ఇప్పించాలని వేడుకున్నాడు. దీంతో కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.

ఆసక్తికరమైన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆరేళ్ల క్రితం మైసూరుకు చెందిన సదరు ప్రభుత్వోద్యోగికి, మరో ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న సదరు మహిళకు వివాహం జరిగింది. ఆ సమయంలో, వివాహం తర్వాత భర్త ఉన్న చోటికే తన ఉద్యోగాన్ని బదిలీ చేసుకోనున్నట్లు ఒప్పందం కుదిరింది. అంతేగాక, వివాహమయ్యాక వరుడి ఇంటి వద్ద రిసెప్షన్, ఆ తర్వాత వధువు ఇంట్లో శోభనం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. తీరా శోభనానికి వధువింటి వారు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో శోభనం జరగలేదు. ఇలా శోభనాన్ని వాయిదా వేస్తూ ఆరేళ్లపాటు సాగదీసింది. అంతేగాక, ఉద్యోగాన్ని సైతం బదిలీ చేయకుండా అతనికి చుక్కలు చూపించింది.

దీంతో మండిపోయిన భర్త తనను మోసం చేస్తున్నారని కోర్టు మెట్లు ఎక్కాడు. దాంపత్య జీవితమంటేనే పారిపోతూ.. తన జీవితాన్ని ఆ మహిళ నాశనం చేసిందంటూ విడాకులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. కాగా ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదేమంటే భర్త పై ఆ మహిళ వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసుల్లో తగిన సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టేసింది. తన భార్య దాంపత్య జీవితానికి అంగీకరించట్లేదని, అంతేగాకుండా భర్త కోసం ఉద్యోగం కూడా బదిలీ చేసుకోనంటుందనే ఆరోపణలతో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జడ్జి ఆ మహిళ నుంచి ఆ భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విడాకుల మంజూరుతో ఇద్దరూ ఆనందం వ్యక్తం చేసారట. అదండీ సంగతి.

English summary

Husband gave divorce to his wife for rejecting first night. Husband gave divorce to his wife for she is not accepting to have sex from 6 years.