కన్య కాదని పెళ్లి చేసుకున్న రెండో రోజే వదిలేసాడు!

Husband gave divorce to wife for she is not virgin

03:37 PM ON 1st June, 2016 By Mirchi Vilas

Husband gave divorce to wife for she is not virgin

టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుందో లేక మనుషులు అడ్వాన్స్ అవుతున్నారో తెలీదు కానీ రోజురోజుకి మనిషి మారిపోతున్నాడు. ప్రతీ విషయంలోనూ తెలివితేటలు చూపిస్తున్నారు. మేము ఎందులో తక్కువ కాదని నిరూపించుకోవడానికి ఏదైనా చెయ్యడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా ఇలాంటిదే ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... నాసిక్ జిల్లాలో మే 22వ తేదిన ఒక యువతీ-యువకుడికి పెళ్లి జరిగింది. తరువాత ఆ యువకుడికి వాళ్ళ కుల పెద్దలు తెల్లటి దుప్పటి ఇచ్చి పడకగదిలోకి తీసుకు వెళ్లాలని చెప్పారు. రెండు రోజుల తరువాత కుల పెద్దలు ఆ తెల్లదుప్పటిని తీసుకుని పరిశీలించారు.

దుప్పటి మీద రక్తపు మరకలు లేకపోవడంతో యువతి కన్య కాదని తేల్చి చెప్పారు. వెంటనే ఆమెకు విడాకులు ఇవ్వాలని పెళ్లికొడుక్కి సూచన ఇచ్చారు. రెండు రోజులు కాపురం చేసిన ఆ పెళ్లి కొడుకు ఇప్పుడు అయోమయంలో పడిపోయాడు. అయితే కుల పెద్దలు మాత్రం వెనక్కి తగ్గలేదు. వివాహ బంధం తెంచుకోవడానికి కుల పెద్దలు అనుమతి ఇచ్చారు. పోలీసు పరీక్షలకు సిద్ధమైన ఆ యువతి రన్నింగ్, లాంగ్ జంప్ చేస్తుందని స్థానిక సామాజిక కార్యకర్తలు తెలిపారు. మొత్తం మీద ఆ పెళ్లి పెటాకులైంది.

English summary

Husband gave divorce to wife for she is not virgin