బావకు భార్యను గిఫ్ట్ గా ఇచ్చేసిన నీచుడు

Husband gave his wife to brother in law

03:02 PM ON 29th July, 2016 By Mirchi Vilas

Husband gave his wife to brother in law

వావి వరసలు మరిచి ఎలాంటి దురాగతాలకైనా వొడిగట్టే నీచులు, దుర్మార్గులు పుట్టుకొస్తున్నారు. ఆదుకోవాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలో వెలుగుచూసింది. బంధాలు అనుబంధాలు మంటగలిసిపోయాయనడానికి ఈ సంఘటన తార్కాణం. పెళ్లయి పట్టుమని నెలకూడా కాలేదు. తన భార్యను ఓ నీచుడు తన బావకు బహుమతిగా ఇచ్చేసాడు. వివరాల్లోకి వెళ్తే.. జూలై 7న పల్ఘర్ జిల్లాలోని బొయ్సర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 22 ఏళ్ల యువతితో వివాహమైంది. భార్యతో కలిసి జీవనం మొదలు పెట్టిన అతని ఇంటికి ఓ రోజు అక్కాబావ వచ్చారు.

భర్త ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్యపై అతని బావ అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ఆ యువతి ప్రతిఘటించి అతనిని హెచ్చరించింది. తీరా భర్త ఇంటికొచ్చాక జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పింది. అయితే బావకు బుద్ధి చెప్పాల్సిన ఆమె భర్త అత్యంత నీచానికి ఒడిగట్టాడు. బావను పిలిచి తన భార్యతో గడపమని ఓపెన్ గా ఆఫర్ ఇచ్చాడు. దీంతో అదను కోసం ఎదురుచూసిన ఆ మృగాడు ఆమె జీవితాన్ని చిదిమేశాడు. బాధను దిగమింగుకున్న ఆ వివాహిత చివరకు మౌల్వి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నింధితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఊళ్ళో జనం ఈ ఘటనతో నిర్ఘాంతపోయారు.

English summary

Husband gave his wife to brother in law