గర్భిణి భార్యను ఫ్రెండ్ తో కల్సి హత్యచేసిన తాగుబోతు భర్త

Husband Killed His Pregnant Wife With The Help Of Friend

11:49 AM ON 19th September, 2016 By Mirchi Vilas

Husband Killed His Pregnant Wife With The Help Of Friend

మహిళలపై కనికరం లేకుండా దారుణాలు జరిగిపోతున్నాయి. చివరకు గర్భిణీ స్త్రీలను కూడా వదలడం లేదు. తాజాగా స్నేహితుడితో కలిసి కట్టుకున్న భార్యను కడతేర్చిన తాగుబోతు భర్త ఉదంతం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మృతురాలు నర్మద (23) మూడు నెలల గర్భవతి. గర్భవతి గా వున్న ఆమె నిద్రలు చేసేందుకు పుట్టింటికి వస్తే, శాశ్వత నిద్రలోకి పంపించాడు భర్త. ఈ ఉదంతానికి సంబంధించి మాచవరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన నర్మదకు సుమారు 6 నెలల క్రితం క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన దారం నరసింహారెడ్డితో వివాహమైంది. కొంతకాలం వారి వైవాహిక జీవితం బాగానే కొనసాగింది. నర్మద గర్భందాల్చింది. కాగా, గర్భం తీసేయాలంటూ నరసింహారెడ్డి కొంతకాలంగా వేధిస్తున్నాడు. నర్మదతో పాటు పాటు ఆమె అత్తమామలు కూడా ఇందుకు ఒప్పుకోలేదు. ఈ నేపత్యంలో నర్మద నిద్రలు చేసేందుకు పుట్టింటికి వచ్చింది. నరసింహారెడ్డి తన స్నేహితుడు పాణెం శివశంకర్ రెడ్డితో కలిసి శనివారం అర్ధరాత్రి మద్యం మత్తులో నర్మద పుట్టింటికి వచ్చాడు. మన ఇంటికి వెళ్దామంటూ భార్యను బలవంతం చేశాడు. తెల్లవారిన తరువాత వెళ్దామంటూ నర్మద భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది.

అయితే దీనికి నరసింహారెడ్డి ఒప్పుకోకుండా ఆదివారం తెల్లవారుజామున తన స్నేహితుడు శివశంకర్ రెడ్డితో కలిసి నర్మద మెడకు చున్నీ చుట్టి చంపారంటూ నర్మద అమ్మమ్మ కంకర బిక్షాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పిడుగురాళ్ల రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, మాచవరం ఎస్ ఐ ఆవుల హరిబాబులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మాచవరం ఎస్ ఐ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలిం చి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: అనుకున్నవేవీ జరగడం లేదా? అయితే ఈ పూజ చెయ్యండి ఇక అంతా శుభమే!

ఇది కూడా చూడండి: ఇంట్లో ఈ విగ్రహాలు ఉంటే మీ పని అయిపోయినట్టే!

ఇది కూడా చూడండి: సైనికుల నుంచి మనం తెలుసుకోవాల్సిన చిట్కాలు

English summary

Husband Killed His Pregnant Wife With The Help Of Friend. Her Name Narmada 23 years old. She was three months pregnant.