భార్యను చంపుతూ ఏం చేసాడో తెలుసా ?

Husband Killed His Wife And Recorded His Murder In Cell Phone

11:41 AM ON 18th January, 2017 By Mirchi Vilas

Husband Killed His Wife And Recorded His Murder In Cell Phone

మర్డర్ చేసేవాడికి భయం లేకుండా పోతుండడమే కాదు, వాటిని చిత్రీకరిస్తున్నారట. వావ్ ఇదేమిటి అనుకుంటున్నారా నిజం. నల్గొండ జిల్లాలో ఇలాంటి దారుణం చోటుచేసుకుంది. సొంత భార్యను చంపుతూ దాని తాలూకు వీడియో చిత్రీకరించాడు ఓ మృగాడు. కొడుకు సుత్తి తెచ్చి ఇవ్వగా దాంతో భార్యను తలపై కొట్టి చంపాడు. దీనికి సంబంధించి సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. జిల్లాలోని చింతపల్లి మండలం రోటిగడ్డ తండాకు చెందిన దంపతులు రాజు, మోతి. ఈనెల 15న భార్య మోతిని భర్త రాజు కిరాతకంగా సుత్తితో కొట్టి చంపేశాడు. అనంతరం పరారయ్యాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రాజును అరెస్ట్ చేశారు. హత్య తాలూకు సెల్ ఫోన్ వీడియోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రాజును రిమాండ్ కు తరలించారు. అయితే ఘటన జరిగినప్పుడు భార్య, భర్తలిద్దరూ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించడం కొసమెరుపు.

English summary

A Man Named Raju was killed his wife by hitting her with Hammer and he recorded the whole thing in cell phone and police arrested him and taken him into their custody. This was became sensational in Nalgonda.