కాపురానికి రానందని... నడిరోడ్డుపై భార్యని ఏం చేసాడో తెలిస్తే షాకౌతారు!

Husband killed his wife for not coming to his home

10:54 AM ON 30th November, 2016 By Mirchi Vilas

Husband killed his wife for not coming to his home

సున్నిత మనస్తత్వం మాటున కర్కశకత్వం చోటుచేసుకుంటోంది.. క్షణికావేశంలో పచ్చని సంసారాల్లో చిచ్చు రగిల్చి ప్రాణాలు హరించుకుపోతున్నాయి. తాజాగా కాపురానికి రానందన్న అక్కసుతో భర్తే నడిరోడ్డుపై గొంతుకోసి భార్యను హత మార్చేశాడు. హృదయ విదారకమైన ఈ ఘటన మంగళవారం హైదరాబాద్ నగరంలో జరిగింది. బేగంపేట పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా వున్నాయి...

1/3 Pages

కవిత(27), ఈశ్వర్ దంపతులు బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఈ నెల 5న కోడలు కన్పించడంలేదంటూ అత్త చంద్రమ్మ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేశారు. అయితే, మంగళవారం సాయంత్రం కవిత తండ్రి సత్యనారాయణ, సోదరుడు పవన్ తో కలిసి బేగంపేట పోలీస్ స్టేషన్ కు వచ్చింది.తాను ఎక్కడికీ వెళ్లలేదని, భర్తతో ఉండటం ఇష్టంలేక మియాపూర్ లోని పుట్టింటికి వెళ్లానని తెలిపింది. అనంతరం పోలీసులు భర్త ఈశ్వర్ ను కూడా పిలిపించారు. ఇద్దర్నీ విచారించారు. భర్తతో కలిసి ఉండడం తనకు ఇష్టం లేదని, తల్లిదండ్రుల వద్దనే ఉంటానని కవిత తేల్చిచెప్పింది.

English summary

Husband killed his wife for not coming to his home