ఫోన్ లాక్ కోడ్ చెప్పలేదని భార్యని ఏం చేసాడో తెలిస్తే షాకౌతారు!

Husband killed his wife for not telling phone code

01:23 PM ON 8th September, 2016 By Mirchi Vilas

Husband killed his wife for not telling phone code

కారణం మాత్రం చాలా చిన్నదే అయినా ఘటన మాత్రం చాలా పెద్దదే.. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ పట్టణంలో జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఝాన్సీకి చెందిన వినీత్ కాన్పూరుకు చెందిన పూనంను వివాహమాడాడు. ఝాన్సీ పట్టణంలో చిరుద్యోగి అయిన వినీత్ కొత్తగా వ్యాపారం ప్రారంభించాడు. వారికి నాలుగేళ్ల కూతురు ఉంది. వ్యాపారం పని మీద భర్త వినీత్ తరచూ ఝాన్సీ, కాన్పూర్ ఊళ్ళ మధ్య తరచూ ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. గత నెల పూనం ఓ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసింది. పూనం తనను, కూతురిని నిర్లక్ష్యం చేస్తుండటంతో పాటు ఆమె వాడుతున్న స్మార్ట్ ఫోన్ ను ఎవరూ ఒపెన్ చేయకుండా ప్యాట్రన్ లాక్ వేసిందని భర్త వినీత్ పోలీసులకు చెప్పాడు.

స్మార్ట్ ఫోన్ కు లాక్ వేసుకోవడంతోపాటు తనకు కోడ్ చెప్పకపోవడంపై వినీత్ కు భార్యపై అనుమానం కలిగింది. అంతే భార్య పూనంను చంపాలని వ్యూహం పన్ని ఆ పనిని తన స్నేహితులైన లక్ష్మణ్, కమల్ లకు 80 వేల రూపాయలు ఇచ్చి అప్పగించాడు. వినీత్ కాన్పూరులో ఉండి తాను ఇద్దరు స్నేహితులను పంపిస్తున్నానని, వారికి తన పర్సనల్ కంప్యూటర్ ఇవ్వాలని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. లక్ష్మణ్, కమల్ లు రాత్రివేళ పూనం ఇంటికి వెళ్లి ఆమెను చంపి నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నగల కోసమే దొంగలు చేసి ఉంటారని పోలీసులు ముందు భావించారు. భర్త వినీత్ పై అనుమానంతో సెల్ ఫోన్ డాటా ఆధారంగా దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటకొచ్చింది.

స్మార్ట్ ఫోన్ లాక్ కోడ్ చెప్పలేదని భార్యపై అనుమానం పెంచుకున్న వినీత్ భార్యను హత్య చేయించాడని ఝాన్సీ ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ చెప్పారు. వినీత్ తో పాటు మరో ఇద్దరు నింధితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఆత్మహత్యలు ఎక్కువగా ఈ దేశాల్లోనే జరుగుతున్నాయట!

ఇది కూడా చదవండి: పాము కాటేస్తే ప్రాణాలు కాపాడుకోవడం ఎలాగో తెలుసా ?

ఇది కూడా చదవండి: విమానం ఎక్కినప్పుడు ఈ తప్పులు చేస్తే మీరు బుక్కయినట్టే!

English summary

Husband killed his wife for not telling phone code