అన్నం పెట్టకుండా ఫోన్ మాట్లాడిందని భార్యని ఏం చేసాడో తెలుసా?

Husband killed his wife for talking in phone

11:30 AM ON 31st October, 2016 By Mirchi Vilas

Husband killed his wife for talking in phone

అరాచకాలకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. తాజాగా భోజనం పెట్టడం ఆలస్యం చేసిందని భార్యను హత్య చేసిన సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శివమంగళ్ రామ్ అనే వ్యక్తి భార్య దుర్గాదేవిని భోజనం పెట్టమని అడగగా, ఆమె ఫోన్ లో మాట్లాడుతూ అతనికి భోజనం పెట్టడం ఆలస్యం చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన రామ్ పదునైన ఆయుధంతో భార్యపై దాడి చేసి హత్య చేశాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, దేవి మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

దేవిని రక్షించే క్రమంలో నిందితుడి బంధువు కూడా గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై పోలీసులు విచారణ చేపట్టారు. ఉదయం పదిగంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని, రామ్ మద్యం తాగి ఉన్నాడని స్థానికులు పేర్కొన్నారు.

English summary

Husband killed his wife for talking in phone