దాని కోసం భార్యని సుత్తితో కొట్టి చంపేసాడు!

Husband killed his wife with hammer

11:09 AM ON 30th April, 2016 By Mirchi Vilas

Husband killed his wife with hammer

కుటుంబ ఆర్థిక ఇబ్బందులో లేక భార్య పై అనుమానమో ఏమో తెలియదుగానీ.. హైదరాబాద్ నగరంలో మరో ఇల్లాలు దారుణ హత్యకు గురైంది. భార్యను సుత్తితో కొట్టి హత్య చేసి.. ఆ తర్వాత తన ఇద్దరు కుమార్తెలతో కలిసి భర్త పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం గురించి వివరాల్లోకెళితే హైదరాబాద్ నగరం ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పటాన్ బస్తీలో షబ్బీర్ అహ్మద్, ఫరా భాను(38) అనే దంపతులు ఉంటున్నారు. వీరికి మహ్మద్ జాఫర్ అహ్మద్(18) అనే కుమారుడు, షఫియా నూరీన్(17), ఆయేషా(13) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, గురువారం ఉదయం కుమారుడు మహ్మద్ జాఫర్ అహ్మద్ తల్లి గదిలోకి వెళ్లగా ఆమె రక్తపు మడుగులో పడి ఉంది.

ఇంట్లో కూడా ఎవరూ లేకపోవడంతో బంధువులకు సమాచారం అందించాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గదిని నిశితంగా తనిఖీ చేయగా, నింధితుడు రాసిన సూసైడ్ నోట్ లభించింది. ఈ లేఖ ప్రకారం మహ్మద్ షబ్బీర్ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, అందుకే భార్యను చంపి తన ఇద్దరు కూతుళ్ళను వెంట పెట్టుకుని ఆత్మహత్య చేసుకునేందుకు అతడు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. షబ్బీర్ ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేస్తున్నారు.

English summary

Husband killed his wife with hammer. A husband killed his wife with hammer and taken his daughters with him and ran away.