భార్యను వెంటాడి నరికేశాడు... అడ్డొచ్చిన అత్తను సైతం... ఆపై...

Husband killed wife and attacked mother in law

01:04 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Husband killed wife and attacked mother in law

చెడు వ్యసనాలకు బానిసైన ఓ వ్యక్తి చివరకు భార్యను కడతేర్చాడు. అడ్డు తగిలిన అత్తపై కూడా దాడికి దిగాడు. ఈ దారుణ ఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం తుని మండలం కమలపాడుకు చెందిన బోజంకి నరసింహమూర్తికి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వరమ్మ అలియాస్ వరలక్ష్మి(35)తో పదహారేళ్ల క్రితం వివాహమైంది. వారికి ప్రస్తుతం ముగ్గురు పిల్లలు ఉన్నారు. కూలిపని చేసుకుని జీవించే నరసింహమూర్తి కొంతకాలంగా హైదరాబాద్ లో కాపురం ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై భార్యను వేధిస్తున్నాడు. అతని వేధింపులు భరించలేక ఆమె కొంతకాలం క్రితం హైదరాబాద్ నుంచి కొవ్వూరుకు వచ్చింది.

ఈ నేపథ్యంలో ఐదురోజుల నుంచి కొవ్వూరు వచ్చి కాపురానికి రమ్మని భార్యను వేధిస్తున్నాడు. ఆమె నిరాకరిస్తూ వస్తోంది. దీంతో గురువారం భార్య వద్దకు వెళ్లిన నరసింహమూర్తి విచక్షణ రహితంగా కత్తితో దాడిచేశాడు. అడ్డువచ్చిన అత్త అచ్చాయ్యమ్మ మీద కూడా కత్తితో దాడిచేశాడు. దీంతో అక్కడ నుంచి తప్పించుకున్న భార్య వరలక్ష్మి రోడ్డుపై పరుగుతీస్తుండగా వెంటపడి వేటాడి నరికాడు. ఆతర్వాత తాను కూడా పీక కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో స్థానికులు వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో వరమ్మ చనిపోయింది. గొంతుపై తీవ్ర గాయంతో నరసింహమూర్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొవ్వూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆనాటి రూపాయి వెలువ ఎంతో తెలుసా?

ఇది కూడా చదవండి: ఎంత పెద్ద వీఐపీ అయినా ఈ కుర్రాడిని కలవాలంటే అపాయింట్మెంట్ ఉండాల్సిందే(ఫోటోలు)

ఇది కూడా చదవండి: దెయ్యాలు నివాసముండే ఫేమస్ సిటీస్ ఇవే!

English summary

Husband killed wife and attacked mother in law. A husband killed his wife and attacked his mother in law in Kovvur.