తొలిరాత్రి కన్య కాదని భార్యను చంపేసాడు

Husband kills his wife for she is not virgin

01:10 PM ON 11th April, 2016 By Mirchi Vilas

Husband kills his wife for she is not virgin

ఆడ పిల్ల అంటేనే అలుసు... ఆడ పిల్ల పుడుతోందని తెల్సి గర్భంలోనే చిదిమేస్తున్నారు. ఒకవేళ పుడితే, ఎక్కడో అక్కడ పసి గుడ్డుని వదిలేస్తున్నారు... ఇక ఆడపిల్ల పెళ్లి అయ్యేవరకు ఒక దాని వెనుక ఓ ఇబ్బంది వెంటాడుతూనే వుంది. ఇది చాలదన్నట్లు పెళ్లి అయ్యాక కూడా ఇబ్బంది కొనసాగుతూనే వుంది. దీంతో తల్లిదండ్రుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. పెళ్ల‌య్యాక ఆ కాపురం ఎలా ఉంటుందో అనే బెంగ ఉండటం సామాన్యం అయిపోయింది. ఎందుకంటే మగవాళ్ళు ఆ విధంగా మారిపోయారు. వారు చేసే పనులకు అర్ధమే ఉండటం లేదు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య‌ను జీవితాంతం కంటికి రెప్ప‌లా చూసుకోవాల్సిన మ‌గాళ్లు మృగాళ్లుగా మారిపోతున్నారు. నానా ర‌కాలుగా హింసిస్తున్నారు.

దీనికి ఆ దేశం ఈ దేశం అనే తేడా లేదు... తాజాగా పాకిస్తాన్ లోని సింధ్‌ ప్రాంతంలోని జకోబాబాద్ జిల్లాలో జ‌రిగిన సంఘ‌ట‌న హృద‌య విదార‌కం అనిపిస్తుంది. పెళ్లి అయ్యిన రోజే తాను వివాహం చేసుకున్న యువతిని చంపేశాడు ఓ కర్కోటకుడు. వివరాల్లోకి వెళ్తే పోలీసుల కధనం ప్రకారం... పాకిస్తాన్ లో 28 సంవత్సరాల భక్ష్ ఖోకర్ అనే యువకుడు, ఖాన్ జాడి లషరి అనే 19 సంవత్సరాల యువతిని పెళ్ళాడాడు. ఈ రెండు కుటుంబాల వారు సమీప బంధువులే అవుతారట. పెళ్లి వరకు బానే జరిగింది. పెళ్లి రోజు రాత్రి పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురు కన్య కాదనే అనుమానం వచ్చింది. అంతే, మరో ఆలోచన లేకుండా ఆమెను సల్వార్ సూట్ కాటన్ ట్వైన్ తో గొంతు పిసికి చంపేసి పారిపోయాడు.

ఉదయం తెల్లారగానే కూతురు కన్పించకపోవటంతో వెతికితిన త‌ల్లిదండ్రుల‌కు త‌మ కుమార్తె మంచం మీద శవమై కనపడింది. దీంతో పోలీసులకు పిర్యాదు చేయగా, అతని సెల్ ఫోన్ ఆధారంగా పట్టుకొన్నారు. పోలీసుల మర్యాద చేశాక హత్య చేశానని ఒప్పుకున్నాడు. తమ సోదరుడు కొంత భిన్నంగా ఉంటాడు. కానీ హత్య చేస్తాడని ఊహించలేదని అతని సోదరులు వాపోయారు.

English summary

Husband kills his wife for she is not virgin on First NIght at Pakistan.