పెళ్ళాన్ని అమ్మకానికి పెట్టిన కలియుగ హరిశ్చంద్రుడు!

Husband Puts His Wife For Sale In Ebay

10:31 AM ON 13th September, 2016 By Mirchi Vilas

Husband Puts His Wife For Sale In Ebay

అప్పుడెప్పుడో హరిశ్చంద్రుడు తన భార్య చంద్రమతిని వేలానికి పెట్టినట్టు పుస్తకాల్లో చదువుకున్నాం. నాటకాల్లో చూసాం. ఇలాంటి విషయాలు చదవడం, వినడం తప్ప దాని గురించి పెద్ద తెలియదు. కానీ ఇప్పుడో కలియుగ హరిశ్చంద్రుడు ఏకంగా తన భార్యను అమ్మకానికి పెట్టాడు. అప్పట్లో హరిశ్చంద్రుడు అంగట్లో అమ్మకానికి పెడితే, యితడు మాత్రం అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో, ఈకామర్స్ వెబ్ సైట్ ఈబేలో అమ్మకానికి పెట్టేసాడు. వివరాల్లోకి వెళ్తే,

జోకెర్ సిమన్ ఓకనె అనే వ్యక్తి తన భార్య లీండ్రాను ఈబేలో అమ్మకానికి పెడుతూ తాను ఎందుకు విక్రయించాలనుకుంటున్నదీ రాశాడు. అంతేకాదు ఆమె సుగుణాల గురించి కూడా పూర్తిగా వివరించాడు. దీంతో రెండు రోజుల్లోనే ఆయనకు 65,880 పౌండ్ల బిడ్లు వచ్చాయి. లీండ్రాకు దైవభక్తి అస్సలు లేదని, తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమాత్రం దైవపూజలు చేయడం లేదని ఇద్దరు పిల్లల తండ్రైన సిమన్(33) పేర్కొన్నాడు. మాటలు, చేతలతో హింసిస్తోందని, అందుకే ఆమెను అమ్మేయాలనుకుంటున్నానని పేర్కొన్నాడు.

ఫర్ సేల్ వన్ వైఫ్ అని అని సిమన్ మొదలు పెట్టడమే కాక ఆమె లక్షణాలను కూడా వివరించుకొచ్చాడు. లీండ్రా బాగా నవ్వుతుందని, మంచి బాడీ వర్క్, చక్కని బాడీ షేప్ ఆమె సొంతమని పేర్కొన్నాడు. ఇక వంటపనిలో ఆమెకు తిరుగులేదని చెప్పుకొచ్చాడు. అయితే ఎప్పుడూ లొడలొడ వాగుతుండడం ఆమెలోని మైనస్ పాయింటని తెలిపాడు.

ఆమె చాలామంచిదని సిమన్ పేర్కొంటూనే ఆమెను దక్కించుకున్నవాడు అదృష్టవంతుడని చెప్పడం మరీ విడ్డూరం. అయితే ఒకసారి అమ్మిన వస్తువు తిరిగి తీసుకోబడదంటూ షరతు కూడా విధించాడు. దీనికి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రెండు రోజుల్లోనే వేలాది పౌండ్ల బిడ్లు వచ్చాయి. ఇక విషయం తెలిసిన లీండ్రా నేను తప్పకుండా సిమన్ ను చంపేస్తా అంటూ భర్త వెంటపడుతోందట.

English summary

A Man Named Joker Simon O’Kane puts his wife named Leandra for sale on e-commerce site Ebay . He also posted some pros and cons about his wife. So many people bid their ammount in just few hours. Now this was gone viral over the internet.