కట్నం కోసం ఒళ్లంతా వాతలు

Husband puts shares to his wife for dowry

12:45 PM ON 28th June, 2016 By Mirchi Vilas

Husband puts shares to his wife for dowry

కట్నం కోసం, పెట్టే హింసలు అన్నీ ఇన్నీ కావు. చివరకు ఎంతకైనా తెగించే, ప్రబుద్ధులు వున్నారు. అదే క్రమంలో రాజస్థాన్ లో ఓ దారుణం చోటుచేసుకుంది. తన తలిదండ్రులు 51 వేల కట్నం ఇవ్వలేదని తన భర్త, అత్త మామలు, బావమరది తనకు నరకం చూపారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నీ తండ్రి దొంగ అని టాటూను తన నుదుటి మీద తన భర్త రాయించాడని, పైగా తన అత్త మామలు ఒళ్లంతా వాతలు పెట్టారని, మామ, బావ మరది తనపై అత్యాచారం చేశారని ఆ బాధితురాలు పేర్కొంది. గత జనవరిలో పెళ్ళయిన ఆరు నెలలనుంచి నన్ను చిత్రహింసలు పెట్టారు అని జైపూర్ లోని అమేర్ లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.

అయితే సాక్ష్యం లభించకుండా చూసేందుకు తన కుటుంబసభ్యులే తన నుదుటి మీది టాటూను... యాసిడ్ పోసి, ఏదో పౌడర్ ఉపయోగించి తొలగించారని బాధిత యువతి పేర్కొనడం విశేషం. అంటే ఈమె ఫ్యామిలీ కూడా ఈమె భర్త కుటుంబంతో కుమ్మక్కు అయినట్టు కనిపిస్తోందని పోలీసులు భావిస్తున్నారు. అయితే బాధితురాలి భర్త, అతని తలిదండ్రులు పరారయ్యారు.

English summary

Husband puts shares to his wife for dowry