లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.. కానీ 19 ఏళ్ళ తరువాత ఒక నిజం బయట పడింది!

Husband recognized after 19 years that his wife was not lady

04:59 PM ON 15th June, 2016 By Mirchi Vilas

Husband recognized after 19 years that his wife was not lady

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ 19 ఏళ్ళు తరువాత ఒక విషయం తెలుసుకుని షాకయ్యాడు. అసలు ఆ భర్త తెలుసుకున్న ఆ నిజమేంటి? అది తెలుసుకున్నాక ఎందుకు షాకయ్యాడు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే మేటర్ లోకి వెళ్ళాల్సిందే.. ఈ వింత సంఘటన బెల్జియంలో చోటు చేసుకుంది. ఆంట్వెర్స్ పట్టణంలో నివసించే ఓ వ్యక్తి 1993లో ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే అతను ఇటీవలే తన భార్య ఆడది కాదని, మగవాడిగా పుడితే, ఆ తర్వాత సెక్స్ మార్పిడి చేయించుకున్నాడని తెలుసుకున్నాడు. పెళ్లి జరిగి పందొమ్మిదేళ్లు కాపురం చేసిన తర్వాత గుర్తించడం విశేషం.

అయితే ఇది అతను స్వయంగా గుర్తించింది కాదు. అతడి భార్య తరపు బంధువు ఒకరు చెబితే అసలు నిజం బయటపడింది. ఒకరోజు భార్య దగ్గరి బంధువు ఒకరు ఇండోనేసియా నుంచి రావడంతో అసలు బండారం బయటపడింది. ఆమె పుట్టుకతోనే అమ్మాయి కాదని, మధ్యలో లింగమార్పిడి చేయించుకుని మహిళగా మారిందని అతనికి చెప్పింది, దీంతో గోల పెట్టడం జాన్ వంతైంది. పిల్లలు కావాలా? అని అడిగినా మోనికా వద్దు అనేదని, నా మొదటి భార్య పిల్లలనే తన పిల్లలుగా భావిస్తానని చెప్పేదని వివరించాడు. దీని వెనుక అసలు సంగతి ఇప్పటికి తెలిసిందని వాపోతున్నాడు.

ఆమెను తాను బెల్జియం తీసుకు వచ్చేందుకు చాలా సమస్యలు ఎదుర్కొన్నానని కానీ, చివరకు మోసపోయానని అంటున్నాడు.

English summary

Husband recognized after 19 years that his wife was not lady