భార్యపై అనుమానంతో ఆమె ల్యాప్ టాప్ చూసిన భర్తకు షాక్!

Husband shocked with by seeing his wife laptop

04:16 PM ON 22nd July, 2016 By Mirchi Vilas

Husband shocked with by seeing his wife laptop

వెజపూర్ లో నివాసముండే 51 సంవత్సరాల ఆర్కిటెక్ తన రెండో భార్యను ఎస్యూవి కారుతో గుద్ది చంపడానికి ప్రయత్నించాడు. అయితే అదృష్టవశాత్తు ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. చంద్రానగర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. హేమరాజ్, కెయూరి భార్యాభర్తలు. కెయూరి అతనికి రెండో భార్య. హేమరాజ్ వయసు 51 సంవత్సరాలు. ఆమె వయసు 31 సంవత్సరాలు. వారిద్దరికీ ఏడు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. పల్డీలోని చంద్రానగర్ లో ఉన్న పనామా సొసైటీలో నివసిస్తున్నారు. కెయూరి బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది.

రెండు నెలల నుంచి భర్తకు వ్యాపార వ్యవహారాల్లో సహాయపడుతోంది. శుక్రవారం కెయూరి అనుమతి లేకుండా ఆమె ల్యాప్ టాప్ తీసుకుని గాంధీనగర్ వెళ్లాడు. అతనిని వెతుక్కుంటూ వెళ్లిన కెయూరి కార్ పార్కింగ్ చేసే ప్రాంతానికి చేరుకుంది. ఆమె అక్కడ ఉండటం గమనించిన హేమరాజ్ కారు విండోస్ అన్నీ క్లోజ్ చేసి కారును వేగంగా ఆమెపైకి పోనిచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన ఆమె తప్పించుకుంది. అప్పటికీ హేమరాజ్ వెళ్లిపోలేదు. కారును వేగంగా రివర్స్ లో ఆమెపైకి పోనిచ్చాడు. దీంతో ఆమె కాలికి గాయమైంది. స్థానికులు గమనించి అంబులెన్స్ లో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు హేమరాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు హేమరాజ్ ను విచారించగా అసలు విషయం బయటపడింది. భార్యాభర్తలిద్దరికీ 20 సంవత్సరాలు వయసులో తేడా ఉండటంతో భార్యపై హేమరాజ్ అనుమానం పెంచుకున్నాడు. ఆమె ల్యాప్ టాప్ లో వ్యక్తిగత వ్యవహారాలను చూసేందుకే తీసుకెళ్లినట్లు హేమరాజ్ అంగీకరించాడు. ల్యాప్ టాప్ లో ఫోటోలు చూసిన హేమరాజ్ ఆగ్రహానికి లోనయ్యాడు. ఆమెను ఎలాగైనా చంపాలనుకున్నాడు. కెయూరి కూడా తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.

English summary

Husband shocked with by seeing his wife laptop