భార్య వేరే పార్టీకి వెళ్లిందని ఆత్మహత్య

Husband Suicide For His Wife Participating in Election Campaign

12:24 PM ON 5th May, 2016 By Mirchi Vilas

Husband Suicide For His Wife Participating in Election Campaign

ఎన్నికలన్నాక ఎవోవే వింతలూ ,వినోదాలూ సహజం ... కానీ అనుకోని విషాదం కూడా కనిపిస్తోంది. తను నమ్మిన పార్టీ కాకుండా భార్య వేరే పార్టీ ప్రచారానికి వెళ్లడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా తిరుమలయంపాళయంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. కూలీనాలీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న డీఎంకే కార్యకర్త పి.రామన్ (40) భార్య మురుగమ్మాళ్‌ ఇటీవల కోయంబత్తూరులో జరిగిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బహిరంగసభకు తన కుమార్తెతో సహా వెళ్లింది. ఈ విషయం తెలిసి డీఎంకే నేతలు కొందరు రామన్‌ను ఎద్దేవా చేశారు. దీంతో మనస్తాపం చెందిన రామన్ మంగళవారం రాత్రి మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు. అనంతరం ఇంట్లోకి వెళ్లి గడిపెట్టుకుని ఉరేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:బికినీ ఫోటోషూట్ లో రెచ్చిపోయిన శృతి హాసన్!

ఇవి కూడా చదవండి:ఖుష్బూపై కేసు నమోదు

ఇవి కూడా చదవండి:ప్రధాని హామీకి విలువ లేదా?

English summary

A Man in Tamilnadu Commits suicide for his wife participated in another party election campaign. Police filed case on this incident and started investigation on this issue.