లేచిపోయిన భార్య పై ఆన్ లైన్ లో రివేంజ్

Husband takes revenge on his deceived wife

05:46 PM ON 15th June, 2016 By Mirchi Vilas

Husband takes revenge on his deceived wife

భార్య మోసం చేస్తే కొందరు భర్తలు రోడ్డెక్కుతారు. ఇంకొందరు ఇదే బాగుందని విపరీతంగా తాగేస్తారు. మరికొందరు ప్రతీకారాలకు దిగుతారు. అయితే ఇంగ్లాండ్ లోని బ్రిడ్గ్ నార్త్ సిటీలో మోసం చేసిన భార్యను చేసేదేమీ లేక తనకు తోచిన పధ్ధతిలో ఓ భర్త ఆన్ లైన్ లో ప్రతీకారం తీర్చుకున్నాడు. అందుకు ఆమెకు సంబంధించిన వస్తువులనే టార్గెట్ గా ఎంచుకున్నాడు. బట్టలు, బూట్లు, కారుతో పాటు ఆమెకు చెందిన మొత్తం వస్తువులను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టేసాడు. ఈబే వెబ్ సైట్ లో తనను మోసం చేసి వేరే వ్యక్తితో తన భార్య లేచిపోయిందని వివరణనిస్తూ, ఈ వస్తువులు ఆమెవే అని వివరించాడు.

వీటిని అమ్మగా వచ్చిన డబ్బులను వ్యభిచారులకు చెందిన సేవా సంస్థకు ఇవ్వనున్నట్టు చెప్పాడు. అంతటితో ఊరుకోలేదు. స్కార్చ్ కొనుక్కుని కళ్లుతిరిగి పడిపోయేవరకు తాగుతానని చెప్పుకొచ్చాడు. ఈ కారును ఎవరికైనా బహుమతిగా ఇవ్వమని, ముఖ్యంగా ఇష్టంలేని వ్యక్తులకు ఇవ్వాల్సిందిగా కోరాడు. తన భార్యలాగే ఈ కారంటే తనకు అసహ్యమని చెప్పాడు. భలే వుంది కదూ.. ఈ ఆన్ లైన్ ప్రతీకరం పై కామెంట్స్ పడిపోతున్నాయి.

English summary

Husband takes revenge on his deceived wife