కలియుగ ద్రౌపది.. ఈమె ఎంత మందిని పెళ్లాడిందో తెలిస్తే షాకౌతారు!

Husband Tells To Cops My Wife Has Married 7 Times

11:47 AM ON 20th September, 2016 By Mirchi Vilas

Husband Tells To Cops My Wife Has Married 7 Times

సాధారణంగా బహు భార్యలు ఉన్నవాళ్ళ గురించి, పిర్యాదులు రావడం విన్నాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్. బహు భర్తల వ్యవహారం ఇది. ద్రౌపదికి 5గురు భర్తలని తెల్సు. కానీ ఈమెకు ఏకంగా 7 గురు భర్తలట. స్వయంగా సొంత భర్త పిర్యాదు చేసాడు. పోలీసులకు ఈ కేసు దర్యాప్తు సవాలుగా మారిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, తన భార్య ఏడుగురిని పెళ్లాడి మోసం చేసిందని సాక్షాత్తు ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదంతం బెంగళూరు నగరంలో జరిగింది.తూర్పు బెంగళూరు నగరంలోని కేజీహళ్లీకి చెందిన తన భార్య యాస్మిన్ బాను (38) తనపై దాడి చేసి కొట్టిందని ఇమ్రాన్ అనే వ్యక్తి కేజీహళ్లీ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. తనపై దాడి చేయడమే కాకుండా తన భార్య ఏడుగురిని పెళ్లాడి తనను మోసం చేసిందని ఇమ్రాన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇమ్రాన్ ఫిర్యాదుపై పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ఆరంభించారు. ఈ కేసులో తాము యాస్మీన్ ను పెళ్లాడామని అఫ్జల్, షోయబ్ లనే మరో ఇద్దరు పోలీసుల వద్దకు వచ్చారు. తనను పెళ్లాడాక పెద్దమొత్తంలో డబ్బు ఇవ్వాలని యాస్మీన్ అడగ్గా తాను డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో తనను వదిలివెళ్లిందని రియల్ ఎస్టేట్ ఏజెంటు అయిన అఫ్జల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తంమీద ఓ మహిళ ఏడుగురిని పెళ్లాడిందని వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: ఏసుదాసుని యాంకర్ ఝాన్సీ ఎంతమాట అనేసింది!

ఇది కూడా చూడండి: వాట్సాప్ లో అది క్లిక్ చేస్తే మీ పని అయిపోయినట్టే!

ఇది కూడా చూడండి: సింహం ఎవరికీ భయపడదు సైనికుడి ప్రసంగానికి జేజేలు (వీడియో)

English summary

Husband Tells To Cops My Wife Has Married 7 Times.