కట్నం కోసం భార్య నగ్న ఫోటోలు పెట్టిన భర్త

Husband uploaded his wife without clothes photos in facebook

11:00 AM ON 15th March, 2016 By Mirchi Vilas

Husband uploaded his wife without clothes photos in facebook

కట్టుకున్న భర్తే కాల యముడయ్యాడు. ప్రేమగా ఉన్నట్లు నటించి కాలకూట షర్పంలా విషం చిమ్మాడు. అసలు విషయంలోకి వస్తే కట్నం కోసం తను ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య నగ్న ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టడమే కాకుండా, ఆ ఫోటోలను ఒక సీడీలో పెట్టి ఆమె తండ్రికి పంపాడు ఓ కిరాతకుడు. ఈ దారుణం కర్ణాటకలోని మంగళూరులో జరిగింది. కాసరగోడులో నివాసముండే 27 సంవత్సరాల ఒక యువకుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అతనికి చేర్తళ(కేరళ) కు చెందిన 20 సంవత్సరాల అమ్మాయి ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. కిందట సంవత్సరం గురువాయూర్‌ దేవస్థానంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

పెళ్లైన కొద్ది నెలలు ఇద్దరూ ఎంతో అన్యూనంగా ఉన్నారు. ఆమె పై కోరిక తీరిపోవడంతో ఆ యువకుడు ఆమెని కట్నం తీసుకు రావాలంటూ హింసించడం మొదలు పెట్టాడు. ఆ టార్చర్‌ భరించలేక ఆ అమ్మాయి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీనితో ఆ మగాడు మృగాడుగా మారిపోయాడు. ముందుగానే పధకం ప్రకారం ఆమె నగ్న ఫోటోలను సెల్‌ఫోన్‌లో దాచుకున్న ఆ నీచుడు ఆ నగ్న ఫోటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. అది చాలదన్నట్లు ఆ ఫోటోలను సీడీలో పెట్టి ఆమె తండ్రికి పంపాడు. దీనితో ఆమె తండ్రి వాడి పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నీచుడ్ని అరెస్ట్‌ చేశారు.

టాలీవుడ్ హీరో ల పారితోషికాలు!!

తారలు..వారి భార్యలు

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం

మీ రాశి ప్రకారం ఎ కెరీర్ లో బాగా రాణిస్తారు

English summary

Husband uploaded his wife without clothes photos in facebook. 26 years software engineer uploaded his wife nude photos in facebook for dowry.