భార్య అంత్యక్రియలకోసం డబ్బు తేవాలని బ్యాంకుకెళ్తే... ఏమైందో తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు!

Husband went to bank for money to do his wife funeral

11:44 AM ON 30th November, 2016 By Mirchi Vilas

Husband went to bank for money to do his wife funeral

పెద్ద నోట్ల రద్దుతో కొన్ని ఇబ్బందులు తప్పవని, ఓపిక పట్టాలని పాలకులు చెబుతున్నారు. అయితే, సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏ రేంజ్ కి చేరాయో ఈ ఘటన రుజువు చేస్తుంది. కళ్లకు కట్టే ఈ సంఘటన నోయిడాలో చోటుచేసుకుంది. హృదయ విదారకమైన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...

1/3 Pages

నోయిడాలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మున్నాలాల్(65)కు నోట్ల రద్దుతో పగవాడికి కూడా రాకూడని కష్టమొచ్చింది. అతని భార్య అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఉదయం 9 గంటలకు ధరమ్ శిల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లమనడంతో ఆటో పట్టుకుని అక్కడికీ వెళ్లాడు.మధ్యాహ్నం 2 గంటలకు ఆమె చనిపోయింది. ఆమెకు చేసిన ఇంజక్షన్స్ కు, మందులకు 7వందలు చెల్లించాడు. సెక్టార్ 9లో ఓ చిన్న గుడిసెలో ఉండే లాల్ భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. లాల్ రోజువారీ కూలీ. పనికెళితే తప్ప డబ్బులుండవు. నోట్ల రద్దుతో కూలి పనికి పిలిచేవాళ్లే కరువయ్యారు. దీంతో భార్య దహన సంస్కారాలు చేయడానికి కూడా డబ్బుల్లేవు.

English summary

Husband went to bank for money to do his wife funeral