షాకింగ్ న్యూస్: డ్రగ్స్ కి బానిసవతున్న హైదరాబాద్ కాలేజీ కుర్రాళ్ళు!

Hyderabad college students are turning as a slaves for drugs

12:18 PM ON 6th October, 2016 By Mirchi Vilas

Hyderabad college students are turning as a slaves for drugs

మంచి గమ్మున రాదు గానీ చెడు బానే అబ్బేస్తుంది. పైగా కాలేజీ డేస్ లో అయితే, ఆకర్షణలకు కొదవలేదు. ఇక మత్తు పదార్ధాలకు కూడా కాలేజీ కుర్రాళ్ళు బానిసలువుతున్నారట. మహానగరాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోందట. అడ్డుకునేందుకు పటిష్ఠమైన వ్యవస్థ లేకపోవంటంతో ఈ దందా మూడు ప్యాకెట్స్.. ఆరు సిరంజిలుగా సాగుతోందని అంటున్నారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు ఐటీ నగరాలుగా పేరొందిన హైదరాబాద్, బెంగళూరులలో విందులు, వినోదాల పార్టీల్లో డ్రగ్స్ కు ఎంతో డిమాండు ఉందని కేంద్ర నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది. నాడీ వ్యవస్థ ఉద్దీపనకు ఉపయోగపడే ఈ డ్రగ్స్ ను మయన్మార్, మలేషియా దేశాల మీదుగా ఆప్రికా దేశాలకు తరలిస్తున్నారని కేంద్ర అధికారుల దర్యాప్తులో తేలింది.

హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో అధికారుల అలసత్వం.. నిఘా వైఫల్యంతో తయారీదారులు చెలరేగుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించాలని అడ్డదారులు తొక్కుతున్నారు. ఫార్మా కంపెనీల ముసుగులో నిషేధిత మత్తుమందులు తయారు చేస్తున్నారు. శాస్త్రవేత్తలుగా మానవాళికి మేలు చేయాల్సిన కొందరు.. డబ్బు కక్కుర్తితో తమ నైపుణ్యాన్ని డ్రగ్స్ తయారీకి ఉపయోగిస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో సుమారు రూ.45 కోట్ల విలువైన 231కిలోల యాంఫెట్ మైన్ ను అధికారులు బెంగళూరులో పట్టుకోవడంతో పలు నివ్వెరపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.

తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ డ్రగ్ తయారీ హైదరాబాద్ పారిశ్రామికవాడల్లో సాగుతుందని తేలింది. ఈ డ్రగ్ రాకెట్ వెనుక కొందరు బడా వ్యక్తుల హస్తముందని నార్కోటిక్ అధికారులు భావిస్తున్నారు. పార్టీ కల్చర్ లో యువతను ఆవహించే మత్తు. మజా ఆస్వాదించాలనే మోజులో కాలేజీ కుర్రాళ్లు డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని సమాచారం. పబ్ లు, రేవ్, వీకెండ్ పార్టీల్లో విచ్చలవిడిగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఎడ్యుకేషన్, టూరిజం వీసాతో నగరంలో తిష్ఠవేసిన నైజీరియన్లు వీటిని సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్ కు అలవాటుపడిన కుర్రాళ్లనే ఏజెంట్లుగా మార్చుకుని కాలేజీలకు రవాణా చేస్తున్నారని అంటున్నారు.

ఇది కూడా చదవండి: ఈఈ రాశుల వారు ప్రేమించుకోకూడదు.. ఎందుకంటే..?

ఇది కూడా చదవండి: గుడి దగ్గర మీ చెప్పులు పోతే మీకు ఏమౌతుందో తెలుసా?

ఇది కూడా చదవండి: మీలో ఈ క్వాలిటీస్ ఉంటే కచ్చితంగా అదృష్టవంతులు అవుతారట!

English summary

Hyderabad college students are turning as a slaves for drugs. Hyderabad college boys are turning as a slaves for drugs.