ఐఎస్‌తో హైదరాబాదీ యువతికి లింకు

Hyderabad Girl Links With IS

01:11 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Hyderabad Girl Links With IS

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థతో హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళకు సంబంధాలు ఉన్నట్లుగా నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఐఎస్‌తో సంబంధాలున్నట్లుగా గుర్తించి గత కొన్ని రోజుల క్రితం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అధికారి మహ్మద్‌ సిరాజుద్దీన్‌ను అరెస్ట్‌ చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు సిరాజుద్దీన్‌కు దేశంలో ఎవరితో సంబంధాలు ఉన్నాయోనన్న కోణంలో విచారిస్తున్నారు. కాగా సిరాజుద్దీన్‌కు చెందిన ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ల ద్వారా సిరాజుద్దీన్‌ ఎవరెవరితో సంభాషించేవారో కూఫీ లాగుతున్నారు. అప్పుడే హైదరాబాద్‌కు చెందిన ఒక 20ఏళ్ళ యువతి ఒకరు ఫేస్‌బుక్‌లో ఐఎస్‌కు చెందిన ఫేస్‌బుక్‌ పేజిని ఫాలో అవుతున్నట్లు గుర్తించారు. ఐఎస్‌ కార్యకలాపాలకు ఆకర్షితమైన ఆ యువతిని గుర్తించిన నిఘా అధికారులు, సదరు యువతికి కౌన్సెలింగ్‌ ఇచ్చే పనిలో పడ్డారట. ఇప్పటికే 15 నుండి 20 మందికిపైగా దేశంలోని వ్యక్తులు, విదేశీయులు కూడా సిరాజుద్దీన్‌కు క్రియేట్‌ చేసిన ఫేస్‌బుక్‌ పేజిని, వాట్సాప్‌ను ఫాలో అవుతున్నట్లు విచారణలో తేలింది.

మహారాష్ట్రలోని మరో ముగ్గురి నలుగురు యువకులను ఐఎస్‌ రొంపిలోకి లాగేందుకు సిరాజుద్దీన్‌ ప్రయత్నించాడట. ఇలా ఎంతమంది ఐఎస్‌కు మద్ధతుదారులు ఉన్నారో కనిపెట్టేందుకు నిఘావర్గాలు విచారణ సాగిస్తున్నాయి.

English summary

Investigation Beauro says that a hyderabad girl having links with Islamic state terrorist groups