చెన్నైకు హైదరాబాద్‌ ఐటి సంస్థల చేయూత

Hyderabad IT Workers Work Harder And Longer For Chennai

12:40 PM ON 4th December, 2015 By Mirchi Vilas

Hyderabad IT Workers Work Harder And Longer For Chennai

చెన్నై మహా నగరం మొత్తం వర్షాలతో దెబ్బతింది. చెన్నై మొత్తం వరద నీటితో మునిగిపోయింది. ఇళ్ళు, స్కూళ్ళు, కాలేజీలు ఇలా ఒకటేమిటి అన్నీ నీట మునిగాయి. చెన్నైలో ఐటి సంస్థల పరిస్థితి కూడా ఇదే. అనేక సాప్ట్‌వేర్‌ కంపెనీలు మూతపడ్డాయి. దీంతో వారు అనుకున్న సమయానికి ప్రాజెక్ట్‌లను పూర్తి చెయ్యలేని పరిస్థితి నెలకొంది.

వీరికి సహాయం అందించేందుకు హైదరాబాద్‌ లోని ఐటి సంస్థలు ముందుకు వచ్చాయి. ఇండియాలో బెంగుళూర్‌ ఐటి హబ్‌ తరువాత రెండో అతి పెద్ద ఐటిహబ్‌ చెన్నైలో ఉంది. హైదరాబాద్‌ ఐటి హబ్‌లో కూడా అనేక సాప్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌ ఉన్నారు .వారందరు చెన్నైలోని తమ సహా ఉద్యోగుల కోసం రోజుకు 5 నుండి 8 గంటలు ఎక్కువగా పనిచేస్తున్నారు.

మనం ఎక్కువ గంటలు పని చేస్తే చాలా మంది సహ ఉద్యోగులు తమ క్లైంట్లకు అనుకున్న సమయంలో ప్రాజెక్టును పూర్తి చేయగలరని, తాను మూడు నాలుగు గంటలు అదనంగా పని చేయడం ద్వారా సహ ఉద్యోగుల ఉద్యోగాలను కాపాడగలనని ప్రముఖ సాప్ట్‌వేర్‌ సంస్థ కాగ్నిజెంట్‌కు చెందిన చైతన్య కుమార్‌ అన్నారు.

చాలా మంది సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇప్పటికే తాము అదనంగా పని చేసిన దానికి వచ్చిన డబ్బును చెన్నైలోని వరద బాధితులకు దానం చెయ్యదలచుకున్నట్లు తెలిపారు.కొంత మంది ఉచితంగానే పని చేయడానికి సిద్ధపడ్డారు.

చెన్నైలోని ప్రముఖ ఇన్ఫోసిస్‌, యాక్సంచర్‌, ఐబిఎమ్‌, కాగ్నిజెంట్‌ వంటి సాప్ట్‌వేర్‌ సంస్థలు కుడా చెన్నై వర్షాలకు అతలాకుతలమైన నేపధ్యంలో తమ సహ ఉద్యోగుల కష్టాలను చూసి తమ వంతు సహాయం చేస్తున్న హైదరాబాద్‌ ఐటి ఉద్యోగులను అభినందించక తప్పదు .

English summary

Hyderabad IT employees were working for extra time in behalf of chennai IT employees. The software companies in the chennai were closed because of rain and flood effect in chennai