మేయర్ అయితే ఏమైనా గొప్పా..?

Hyderabad Police Fined GHMC Mayor

06:42 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Hyderabad Police Fined GHMC Mayor

సామాన్యులకు ఒక రూలు.. వీవీఐపీలకు మరో రూల్ అన్న వ్యత్యాసం తమకు లేదని హైదరాబాద్ పోలీసులు తేల్చారు. తప్పు చేసిన ఎవరినైనా.. నిబంధనల్ని అతిక్రమించిన వారు ఎవరైనా.. ఏ స్థాయి వారైనా వారికి చట్టబద్ధమైన చర్యలు తప్పవన్న విషయాన్ని తేల్చేస్తూ, తమ కమిట్మెంట్ ను ప్రదర్శించారు. వివరాల్లోకి వెళ్తే, రోడ్డు ప్రమాదాల్ని అరికట్టేందుకు వీలుగా డ్రైవింగ్ లైసెన్సుల మీదా.. హెల్మెట్ ధరించాలన్న అంశం మీద హైదరాబాద్ పోలీసులు కఠిన నిబంధనల్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కుడా చదవండి:మీది ప్రేమా ? స్నేహమా ? టెస్ట్ చేసుకోండి

అయితే.. వారి కమిట్ మెంట్ ను ప్రశ్నించే రీతిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్.. పారిశుద్ధ్యం మీద ఆకస్మిక తనిఖీ నిర్వహించేందుకు వీలుగా బుధవారం రాత్రి బుల్లెట్ మీద గ్రేటర్ లోని పలు ప్రాంతాల్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనే స్వయంగా ద్విచక్రవాహనాన్ని నడిపారు. అయితే.. వాహనాన్ని నడిపే క్రమంలో ఆయన హెల్మెట్ పెట్టుకోకుండానే డ్రైవ్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఇవి కుడా చదవండి:గుడిలోనే రాసలీలలు.. అడ్డంగా దొరికిన ఉద్యోగి(వీడియో)

సామాన్యులు కానీ ఇలాంటి తప్పులే చేస్తే.. చలానాలు విధించే నగర పోలీసులు.. మేయర్ విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే.. హెల్మెట్ పెట్టుకోకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపిన మేయర్ కు తాజాగా పోలీసులు ఈ-చలానా పంపినట్లుగా చెబుతున్నారు. ఆయన ఇంటికి చలానా పంపటం ద్వారా నిబంధనల విషయంలో తమ కమిట్మెంట్ ను ఎవరూ ప్రశ్నించలేరన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పొచ్చు.

ఇవి కుడా చదవండి:

అధిక బరువు లేదా ఊబకాయం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు

అనుష్క ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబొతున్న ప్రభాస్?

సూర్యాస్తమయం తరువాత వెళ్ళారో... రాయి అయిపోతారు

English summary

Hyderabad Police Have Fined Greater Hyderabad Municipal Corporation (GHMC) mayor Bonth Ram Mohan for Not wearing Helmet .