భాగ్యనగరం టూ అమరావతి.. సైకిల్ యాత్ర(వీడియో)

Hyderabad to Amaravathi cycle tour

01:04 PM ON 24th June, 2016 By Mirchi Vilas

Hyderabad to Amaravathi cycle tour

ఏపీ రాజధాని అమరావతికి తరలిరావాలని ఉద్యోగులకు ప్రభుత్వం పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. అదికూడా ఓ మహిళా ఉద్యోగిని చేస్తున్న ప్రయత్నం.. వివరాల్లోకి వెళ్తే.. ఉద్యోగుల విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన ఉద్యోగులు శాఖల వారీగా అమరావతి బయల్దేరుతున్నారు. సహకార, వాణిజ్య, సమాచార శాఖకు చెందిన ఉద్యోగులు శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో విజయవాడ బయల్దేరారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న అధికారిణి పద్మ తన ప్రయాణాన్ని భిన్నంగా ఎంచుకున్నారు.

ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపాలని అందరిలా కాకుండా సైకిల్ పై అమరావతి బయల్దేరారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం నేతలు అశోక్ బాబు, కృష్ణయ్య తదితరులు పద్మకు మద్దతు తెలిపారు. అనంతరం పద్మ సైకిల్ ప్రయాణాన్ని అశోక్ బాబు జెండా ఊపి ప్రారంభించారు.

English summary

Hyderabad to Amaravathi cycle tour