వాహనదారులకు దసరా ఆఫర్ ప్రకటించిన ట్రాఫిక్ పోలీస్ సంస్థ!

Hyderabad traffic police gave dasara offer

02:50 PM ON 4th October, 2016 By Mirchi Vilas

Hyderabad traffic police gave dasara offer

చిన్నలకు పెద్దలకు అందరికీ ఇష్టమైన పండగ దసరా పండగ. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకుంటాం. ఇక దసరా తెలుగు వాళ్ళందరు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అంతే కాదు దసరా వచ్చిందంటే అన్ని షాప్స్ తమ ఆఫర్స్ తో కస్టమర్లను ఆకర్షించే పనిలో ఉంటారు.. తాజాగా ఈ దసరాకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు కూడా వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారికి తాము విధించే చలానాల్లో సగం మొత్తం చెల్లిస్తే సరిపోతుందంటూ 50% ఆఫ్ అనే ఆఫర్ ను ప్రకటించారు. అయితే ఇందుకు ఓ చిన్న కండిషన్ పెట్టారు. వాహన చోదకులు ముందుగా అదాలత్ కు హాజరై, అక్కడ చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నెల 5 నుండి 7 వరకు గోషామహల్ లోని పోలీసు స్టేడియంలో నిర్వహించే అదాలత్ కు చలానాలు తీసుకుని వచ్చి ఈ ఆఫర్ ను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. గోషామహల్ పోలీస్ స్టేడియంలో అక్టోబర్ 5, 6, 7 తేదీల్లో నిర్వహించే అదాలత్ లో పెనాల్టీ సొమ్ములో సగం చెల్లించి కేసుల నుంచి బయటపడే అవకాశం కల్పిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల ఉల్లంఘనలను పాయింట్లు ద్వారా లెక్కించనున్నారు. వాటి ఆధారంగా లైసెన్స్ రద్దు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్, మొబైల్ మాట్లాడుతూ వాహనాలను నడుపుతూ వేలాదిమంది సీసీకెమెరాలకు చిక్కుతున్నారు. ఇలా పట్టుబడిన వందలమందికి ప్రతిరోజూ ఈ-చలానాలు పంపుతున్నారు. వాహనాల క్రయ, విక్రయాల్లో పెండింగ్ చలానాలు చాలా కీలకం. వాహనాలను రిజిస్ట్రేషన్ చేసేందుకు రవాణాశాఖ విభాగంలో ఎన్వోసీ సర్టిఫికేట్ సమర్పించాలట. ఈ పరిస్థితుల్లో వాహనదారులు పెండింగ్ పెనాల్టీ చెల్లించేందుకు ఇది మంచి అవకాశమని ట్రాఫిక్ ఏసీపీ ఎ.వి.రంగనాథ్ చెప్పుకొచ్చారు. పెద్ద మొత్తంలో బకాయిలుంటే రూ.1000 చెల్లిస్తే చాలని వివరించారు.

English summary

Hyderabad traffic police gave dasara offer