ప్రేతాత్మల పరిశోధకుడిగా గుర్తింపు పొందిన గౌరవ్ తివారి అనుమానాస్పద స్థితిలో మరణం

Hypnotist Gaurav Tiwari death mystery

12:51 PM ON 12th July, 2016 By Mirchi Vilas

Hypnotist Gaurav Tiwari death mystery

సహజ మరణం అయితే, ఏ గొడవా లేదు అదే అనుమానాస్పదంగా మరణిస్తే, ఇబ్బందే. ఇప్పుడు ప్రసిద్ధ పారానార్మల్ పరిశోధకుడు, హిప్నాటిస్ట్ గౌరవ్ తివారీ(32) మరణం అలానే ఉంది. ఇతడు ఢిల్లీలోని భారత పారానార్మల్ సొసైటీ వ్యవస్థాపక సీఈవో తివారీ ద్వారక ప్రాంతంలో తన ఫ్లాట్ లోని బాత్రూమ్ లో శవమై కనిపించారు. తన ఫ్లాట్ లో అనుమానాస్పద పరిస్థితుల్లో గత గురువారం చనిపోయారని అంటున్నారు. వాస్తవానికి బాత్రూమ్ నుంచి దబ్ మన్న శబ్ధం బిగ్గరగా వినిపించడంతో అలర్ట్ అయిన కుటుంబసభ్యులు బలవంతంగా తలుపు తెరిచి అపస్మారక స్థితిలో ఉన్న తివారిని ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే గౌరవ్ చనిపోయినట్టు వైద్యులు తేల్చేసారు. ఈ ఏడాది జనవరిలో వివాహం అయిన గౌరవ్ తల్లిదండ్రులు, భార్యతో కలిసి నివసిస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకునేంత పెద్ద సమస్యలేవీ లేవని తెలుస్తోంది. ప్రాథమిక పోస్ట్ మార్టం నివేదికలో మెడ చుట్టూ నల్ల లైన్ ఉండడంతో, ఊపిరి ఆడక చనిపోయి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఒక ప్రతికూల శక్తి తన వైపు లాక్కుంటోందని గౌరవ్ తివారి ఒక నెల క్రితం భార్యతో చెప్పినట్టు తెలుస్తోంది. ఎంత ప్రయత్నించినా, అదుపు చేయడం కష్టంగా ఉందని భార్య దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే పనిలో ఒత్తిడికారణంగా అలా ఆలోచిస్తున్నారని తాను పెద్దగా పట్టించుకోలేదని పోలీసులకు తెలిపింది. పారానార్మల్(విపరీత మానసిక ప్రవర్తన గల) సమాజం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2009లో పారానార్మల్ సొసైటీని స్థాపించి తన సేవలను అందిస్తున్నారు. విపరీత మానసిక ప్రవర్తన గల దాదాపు 6000 ప్రదేశాలను సందర్శించి.. దర్యాప్తు చేపట్టారు. ఇంతలో ఆయన మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల విచారణ కొనసాగుతోంది. మరి ఇతని మరణం మిస్టరీ చెందిస్తారో లేదో చూడాలి.

English summary

Hypnotist Gaurav Tiwari death mystery