నేను సెక్స్ కి బానిసని

I am a sex addict: Patralekha

11:59 AM ON 25th March, 2016 By Mirchi Vilas

I am a sex addict: Patralekha

2014లో విడుదలైన 'సిటీ లైట్స్' చిత్రంలో తన సహజమైన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకున్న పాత్రలేఖ కొంచెం గ్యాప్ తరువాత నటిస్తున్న తాజా చిత్రం 'లవ్ గేమ్స్'. ఎవరైనా సరే తమకు తాము సెక్స్ కి బానిస అని చెప్పకోవాలంటే వాళ్ళకి చాలా ధైర్యం కావాలి. ఇలాంటి పాత్రల్లో నటించాలంటే ఎంతో సాహసం కావాలి. కొందరు నటీనటులు మాత్రమే వెండితెర పై ఇలాంటి సాహసం చేయగలరు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే పాత్రలేఖ నటించిన తాజా చిత్రం లవ్ గేమ్స్ లో ఆమె సెక్స్ కి బానిసైన(Sex Addict) పాత్రలో నటించింది. తాజాగా విడుదలైన పోస్టర్స్ లో పాత్రలేఖ బ్యాక్ లెస్ గా దర్శనమిస్తుంది. ఇందులో ఆమె ఎంతో సెక్సీ గా కనిపిస్తుంది. ట్రాయింగిల్ లవ్ స్టోరీతో పాటు ఆసక్తికరమైన సెక్స్ గేమ్ తో 'లవ్ గేమ్స్' చిత్రం సాగుతుంది.

ఈ చిత్రానికి విక్రమ్ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పాత్రలేఖతో పాటు గౌరవ్ అరోరా, '100% లవ్' ఫేమ్ తారా అలీషా బెర్రీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇందులో ఘాటైన సన్నివేశాలు గట్టిగా దట్టించినట్లు తెలుస్తుంది. ముద్దు సన్నివేశాలు కూడా అధికంగా ఉన్నాయని సమాచారం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ని మీరు కూడా ఒకసారి వీక్షించండి.

1/3 Pages

ట్రైలర్:

'లవ్ గేమ్స్' ట్రైలర్ ఇదే.

English summary

I am a sex addict: Patralekha. City Lights movie fame Patralekha is acting as a sex addict in Love Games movie.