నా 'కలల రాకుమారిని' కలవలేదు..

I didn't meet my dream girl

12:55 PM ON 5th January, 2016 By Mirchi Vilas

I didn't meet my dream girl

'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌. ఈ చిత్రం ప్రభాస్‌కి తిరుగులేని ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. అయితే టాలీవుడ్‌ హీరోస్‌ లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచలర్‌ ఎవరంటే ప్రభాస్‌ పేరు ముందు వినిపిస్తుంది. అలాంటి ప్రభాస్‌కి చాలా ఇంటర్వ్యూల్లో తన పెళ్లి కి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఏదొకటి చెప్పి మాట దాటేశేవాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్‌కి ఇటువంటి ప్రశ్నే ఎదురైతే ప్రభాస్‌ ఈ విధంగా స్పందించాడు. ప్రస్తుతం నేను 'బాహుబలి -2' మొదటి షెడ్యూల్‌ ఘాటింగ్‌లో బిజీగా ఉన్నాను, ఈ సినిమా పైనే ప్రస్తుతం దృష్టి పెట్టాను.

నా పెళ్లి విషయానికొస్తే నేనింకా నా కలల రాకుమారిని కలవలేదు, నిజం చెప్పాలంటే నా కలల రాకుమారికి ఏమేమి క్వాలిటీస్‌ కావాలో నాక్కూడా తెలియదు. ఒకవేళ నా కలల రాకుమారి దొరికితే గనుక కచ్చితంగా అందరికీ తెలియజేస్తానని స్పష్టంగా చెప్పాడు. క్రిందటి సంవత్సరంలో ప్రభాస్‌ పెళ్లని, ప్రభాస్‌ పెళ్లి చేసుకోబోతున్నది ఈమె అని తన ఫోటోలు కూడా పెట్టి విపరీతంగా వార్తలు క్రియేట్‌ చేశారు. అయితే అవన్నీ పుకార్లని కృష్ణంరాజు తోసిపుచ్చారు. బాహుబలి-2 ఘాటింగ్‌ అయిపోయాక ప్రభాస్‌ వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

English summary

I didn't meet my dream girl: Prabhas