రిటైర్మెంట్‌ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

I didn't take any decision about my retirement Afridi

10:36 AM ON 26th March, 2016 By Mirchi Vilas

I didn't take any decision about my retirement Afridi

ప్రస్తుతం ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడినా ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. అయితే ఈ టోర్నీ అనంతరం అఫ్రిది క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకోనున్నాడని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో రిటైర్మెంట్‌ తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పాకిస్థాన్‌ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది అన్నాడు. మొహాలిలో ఆస్ట్రేలియా-పాక్‌ మధ్య కీలక మ్యాచ్‌ ఆరంభంలో మాట్లాడుతూ.. ‘ఇప్పుడు నేను రిటైర్మెంట్‌ తీసుకోవాలనుకోవడం లేదు. నా దేశ ప్రజల ఎదుటే నేను క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతా’ అని స్పష్టం చేశాడు. అయితే ఇప్పటికే పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అఫ్రిదిని ఈ మెగా టోర్నీ అనంతరం టీ20 కెప్టెన్సీ నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది.

English summary

I didn't take any decision about my retirement: Shahid Afridi. I will take the decision after I am going to my country and I will announce in My country only.