సూపర్ స్టార్ నంబర్ అడిగే అంత దమ్ము నాకు లేదు!!

I don't have guts to ask Super Star his phone number

03:39 PM ON 28th January, 2016 By Mirchi Vilas

I don't have guts to ask Super Star his phone number

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ చాలా సంతోషంగా ఉన్నాడు. అక్షయ్‌ తాజా సినిమా 'ఎయిర్‌ లిఫ్ట్‌' బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. అంతేకాకుండా భారత ప్రభుత్వం అక్షయ్‌కు 'పద్మశ్రీ' పురస్కారం ఇవ్వడంతో అక్షయ్‌ సంతోషం మరింత రెట్టింపయ్యింది. రజనీ కి కూడా పద్మవిభూషణ్‌ అవార్డు లభించింది. అక్షయ్‌ రజనీ 'రోబో 2.0' సినిమాలో విలన్‌ పాత్రలో నటిస్తున్నాడు. మీడియా వారు అక్షయ్‌ను రజనీ పద్మవిభూషణ్‌ పురస్కారం గెలుచుకున్నందుకు గానూ ఆయనను అభినందించారా అని అడగగా, అక్షయ్‌ ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పాడు.

రజనీ కాంత్‌ గారి ఫోన్‌ నంబర్‌ నా దగ్గర లేదు. ఆయన్ని ఫోన్‌ నంబర్‌ అడిగితే అంత దమ్ము నాకులేదు అని సమాధానమిచ్చాడు. దీంతో అక్షయ్‌ రజనీని ఎంతగా ఆరాధిస్తాడో అని అర్ధమవుతుంది. రజనీది గోల్డెన్‌ హార్ట్‌ అన్నాడు అక్షయ్‌. రజనీ ఫోటో షూట్‌ చేసే సమయంలో చాలా దూరం నుంచి చూసేవాడట. చిన్న పిల్లలు మిఠాయి దుకాణానికి తీసుకెళ్ళినప్పుడు మిఠాయిల వైపు ఎంత ఆత్రుతగా చూస్తారో రజనీకాంత్‌ గారిని నేనూ అలాగే చూసేవాడినని చెప్పాడు అక్షయ్‌.

English summary

Bollywood Star Hero Akshay Kumar is acting in Robo 2.0 as a Villan. Recently he get Padma Shri award. Due to this some media interviews Akshay Kumar. In that interview media asked akshay did u congratulate RajiniKanth. For that he replied I don't have guts to ask Super Star his phone number.