అలా కొరికితే నచ్చదు

I don't like guys who bite their nails: Shruti Hassan

05:49 PM ON 8th February, 2016 By Mirchi Vilas

I don't like guys who bite their nails: Shruti Hassan

ప్రస్తుతం సౌత్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగుతున్న హీరోయిన్‌ శృతిహాసన్‌. తన నటనతో, అందాల విందుతో మురిపిస్తున్న శృతిహాసన్‌ ప్రస్తుతం తెలుగు, తమిళంలో తీరిక లేకుండా సినిమాలు చేస్తుంది. అయితే శృతి తాజాగా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో వివరించింది. ముందుగా అసలు మగవాళ్ళని ఎలా అంచనా వేస్తానో చెప్పింది. ముందుగా నా వద్దకు వచ్చే మగాళ్ళ కళ్ళు చూస్తాను, వాళ్లు నా వైపు చూసే చూపు బట్టి వాళ్ల పై ఒక అభిప్రాయానికి వస్తాను అని చెప్పుకొచ్చింది. అంతేకాదు చాలామంది అబ్బాయిలను వాళ్లు తమ గోళ్ళను కొరుక్కుంటూ కనిపిస్తే నచ్చదు.

అలా గోళ్ళు కొరుక్కునే అబ్బాయిని నా లైఫ్‌లోకి రానివ్వను, నాకు వాళ్ళంటేనే చిరాకు. అంతేకాదు నాకు కాబోయే వాడు గొప్పవాడు కాకపోయినా పర్వాలేదు. కానీ నన్ను అర్ధం చేసుకునే వాడై ఉండాలి. అతనికి మంచి మనసు ఉండాలి అని తనకి కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పింది. అలా ఎవరైనా ఉంటే అతన్ని నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటా అని కుండ బద్దలు కొట్టింది.

English summary

Hot South Indian beauty gave interview about boys. She told that I don't like guys who bite their nails. I hate them.