ప్రియాంక పేరుతో పనే లేదన్న రాబర్ట్‌ వాద్రా

I Dont Need Priyanka Support Says Robert Vadra

10:27 AM ON 15th April, 2016 By Mirchi Vilas

I Dont Need Priyanka Support Says Robert Vadra

పలు కుంభకోణాలకు సంబంధించి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధి భర్త రాబర్ట్‌ వాద్రా పై ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా హరియాణాలో అక్రమంగా భూములు తీసుకున్నారని వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కొంచెం సీరియస్ గా స్పందించారు. డిల్లీ గోల్ఫ్‌ క్లబ్‌ దగ్గర ఓ న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడిన వాద్రా తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదంటూ తేల్చేసారు. సోనియా కుమార్తె ప్రియాంక గాంధీతో వాద్రాకు 1997లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘నాకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోగలిగే సామర్థ్యం నాకు ఉంది. నా జీవితాన్ని మెరుగుపరిచేందుకు ప్రియాంక పేరును ఉపయోగించుకోవాల్సిన అవసరమేమీ లేదు. నా తల్లిదండ్రులు నాకు కావల్సినంత ఇచ్చారు’ అని రాబర్ట్‌ వాద్రా పేర్కొన్నారు. ఈ కుటుంబంతో 20ఏళ్లుగా కలిసి ఉంటున్నానని, మరో 20 ఏళ్లయినా రాజకీయాల వైపు వచ్చేది లేదన్నారు. తాను ఏదైనా మార్పు తీసుకురాగలననుకుంటేనే రాజకీయాల్లోకి వస్తానన్నారు. తన జీవితాన్ని ఉద్ధరించడానికి ప్రియాంక గాంధీ అవసరమేమీ లేదన్నారు.తాను భారత్‌లోనే పుట్టి పెరిగానని, ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్‌ వదిలి వెళ్లనని వాద్రా అంటున్నాడు. తనకు పరిస్థితులను ఉన్నదున్నట్లుగా స్వీకరించగలిగే సామర్థ్యం ఉందని, తనకు గొప్ప బలాన్నిచ్చే మంచి కుటుంబం ఉందని వాద్రా అన్నారు. వాద్రా గతంలో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీల కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

కరువుకి - ఐపిఎల్ మ్యాచ్ కి లింకా ?

పవన్ కామెంట్స్ కు హర్ట్ అయిన బన్నీ

అప్పట్లో పవన్ మొదటి సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా?

English summary

Sonia Gandhi Son in Law and Husband of Priyanka Gandhi Robert Vadra says that he don't need Priyanka Gandhi to enhance his life. He says that His Parents give him so much Support and God gave him good family.