ఎవరికీ సపోర్ట్ చేయనన్న హీరో విజయ్

I Dont Support Any Party Says Hero Vijay

11:24 AM ON 11th May, 2016 By Mirchi Vilas

I Dont Support Any Party Says Hero Vijay

ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్న సినిమా నటీనటుల్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో వినియోగించటం కొత్త కాదు. అందుకే పాలిటిక్స్ కు సినిమా తారలకు మధ్య నున్న అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఎన్నికల సందర్భంగా రాజకీయాల జోలికి వెళ్లని నటీనటులు..తమ ప్రస్తావన ఎక్కడా రాకుండా ఉంటేచాలని అనుకుంటారు. తమ ప్రస్తావన వచ్చి.. అందుకు భిన్నంగా తాను రియాక్ట్ అయితే లేనిపోని ఇబ్బందులు ఎందుకన్న భావన సినిమా నటుల్లో కనిపిస్తుంది.

ఇవి కుడా చదవండి:ఎంపీలు వారంపాటు నియోజకవర్గాల్లో ఉండాల్సిందే

కానీ.. అలాంటి మొహమాటాలకు గురి కాకుండా ఓపెన్ గా తన వైఖరిని చెప్పేసి.. తన స్టైలే వేరన్నట్లుగా తమిళనాడు యువ హీరో విజయ్ వ్యవహరిస్తున్నాడు. తమిళనాడులో రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి అభిమానులున్న ఏకైక హీరో విజయ్ మాత్రమేనని అందరికీ తెల్సిందే. అలాంటి విజయ్ ఇమేజ్ ను వాడుకోవాలని పలు రాజకీయ పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో. విజయ్ తరఫున ఒక ప్రకటన వెలువడింది. తాజా ఎన్నికల్లో తాను ఏ పార్టీకి మద్దతు తెలపటం లేదని.. తాను మధ్యంతరంగా వ్యవహరిస్తున్న విషయాన్ని తేల్చేసిన విజయ్.. తాను ఏ పార్టీ తరఫున ప్రచారం చేయటం లేదని తేల్చేశాడు. తాను మద్దతు ఇస్తున్నట్లు ఎవరైనా ప్రచారం చేస్తే నమ్మొద్దని, ఎవరికి ఇష్టమైన పార్టీకి వారు ఓటు వేసుకోవచ్చని.. తన పేరును ఎవరూ వాడుకోకూడదని.. ఒకవేళ ఏ పార్టీ అయినా తన పేరును వాడుకుంటే మాత్రం తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. రాజకీయాలకు దూరంగా ఉంటూ.. ఇంత విస్పష్టంగా తేల్చేయటం చూస్తే.. విజయ్ కు ధైర్యం ఎక్కువేనని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.

ఇవి కుడా చదవండి:హైదరాబాద్ క్లబ్ లో యువకుడి రేప్ ఆ పై హత్య

ఇవి కుడా చదవండి: నన్ను చంపేస్తారు అంటూ పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్

English summary

Tamil Top Hero Vijay says made a statement that he was not supporting any political party in Tamilnadu Elections and he said that don't use his name. If any one uses his name then he warned that he will take legal actions on them.