ప్రధాని కావాలనుకోలేదు: రాష్ట్రపతి ప్రణబ్

I Dont Wanted To Become Prime Minister Says Pranab Mukherjee

10:54 AM ON 29th January, 2016 By Mirchi Vilas

I Dont Wanted To Become Prime Minister Says Pranab Mukherjee

ఇందిరాగాంధీ హత్య తర్వాత తాను ప్రధానమంత్రి కావాలని వచ్చిన కథనాలన్నీ అసత్యాలని.. తాను ఎప్పుడూ ప్రధానమంత్రి పదవి పై ఆశ పడలేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. ప్రణబ్‌ ముఖర్జీ తన రాజకీయ జీవితంలోని ముఖ్యమైన ఘటనలతో రచించిన పుస్తకం రెండో భాగాన్ని ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ గురువారం ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ హత్య, బాబ్రీ మసీదు కూల్చివేత, ఆపరేషన్‌ బ్లూ స్టార్‌, రాజీవ్‌గాంధీ కేబినెట్‌ నుంచి ఉద్వాసన వంటి పలు కీలకమైన అంశాలను పుస్తకంలో ప్రణబ్‌ ముఖర్జీ ప్రస్తావించారు. 1980-1990 మధ్య జరిగిన పలు అభివృద్ధి అంశాలు, స్వాతంత్య్రానంతరం సంభవించిన కల్లోల పరిస్థితులను కూడా అందులో పొందుపరిచారు. ద టర్బులెంట్ ఇయర్స్:1980-1996 పేరుతో విడుదల చేసిన ఈ పుస్తకంలో ప్రణబ్‌ ముఖర్జీ.. రాజీవ్‌గాంధీ కేబినెట్‌, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన విషయాలను కూడా ప్రస్తావించారు. రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఎదిగిన కాలం నుంచి పీవీ నరసింహరావు జాతీయ నేతగా వెలుగులోకి వచ్చిన కాలం వరకు పలు ముఖ్యమైన రాజకీయ అంశాలను పుస్తకంలో పొందుపరిచారు. నేను తెగువ చూపలేనని ఈ పుస్తకం చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే 1960లో కాంగ్రెస్‌ తిరుగుబాటుదారుడు అజయ్‌ ముఖర్జీ, ప్రస్తుత మమతాబెనర్జీ, అప్పటి ఇందిరాగాంధీ లాంటి భారీ ప్రజాదరణ వ్యక్తిని కాదు అని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. అత్యంత గోప్యమైన అంశాలను వెల్లడించలేదని.. పాఠకులే పుస్తకాన్ని చదివి ఓ నిర్ణయానికి రావలసి ఉంటుంది అని అన్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి భాజపా సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ, కేంద్రమాజీ మంత్రి కరణ్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు.

English summary

President Pranab Mukherjee says that he did not wanted to become prime minister. The book which was written by Pranab mukherjee on his political carrier second part was released by Deputy President of India Hameed Ansari . BJP Senior leader L.K.Adwani,Central Minister Karan Singh and few others were attended to this event